ICC Rankings: కోహ్లీ @ 5.. రాహుల్‌ @ 6

తాజా వార్తలు

Published : 08/07/2021 02:12 IST

ICC Rankings: కోహ్లీ @ 5.. రాహుల్‌ @ 6

దుబాయ్‌: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఆరో ర్యాంకుకు ఎగబాకాడు. ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మలన్‌ (888 రేటింగ్‌), ఆరోన్‌ ఫించ్‌ (830), బాబర్‌ ఆజామ్‌ (828), డేవిడ్‌ కాన్వే (774) వరుసగా 1,2,3,4 స్థానాల్లో నిలిచారు.

విరాట్‌ రేటింగ్‌ పాయింట్లు 762 కాగా రాహుల్‌ 743తో అతడి వెనకాలే ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో నిలిచిన భారత ఆటగాళ్లు వీరిద్దరే కావడం గమనార్హం. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ (2), రోహిత్‌ శర్మ (3) టాప్‌-5లో కొనసాగుతున్నారు. బాబర్‌ ఆజామ్‌ వారి కన్నా ముందున్నాడు.

బౌలర్ల జాబితాలో జస్ప్రీత్‌ బుమ్రా ఒక్కడే టాప్-10లో నిలిచాడు. ఒక ర్యాంకు దిగజారి ఆరో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంకులో ఉన్నాడు. ఇంగ్లాండ్‌, శ్రీలంక పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసులు ముగియడంతో ఐసీసీ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని