ఇంగ్లాండ్‌ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

తాజా వార్తలు

Updated : 19/01/2021 20:18 IST

ఇంగ్లాండ్‌ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

హార్దిక్‌, అక్షర్‌ పటేల్‌కు చోటు 

ఇంటర్నెట్‌డెస్క్: వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ సారథ్యంలో 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. పితృత్వ సెలవులపై ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మూడు టెస్టులకు దూరమైన కోహ్లీ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయాలతో ఆసీస్‌ సిరీస్‌కు దూరమైన ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు.

కాగా, ఆసీస్‌ తొలి టెస్టులో విఫమలైన పృథ్వీ షాకు నిరాశే మిగిలింది. అతడు జట్టులో చోటు కోల్పోయాడు. గాయాలపాలైన హనుమ విహారి, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌కు విశ్రాంతినిచ్చారు. స్వదేశంలో ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగు టెస్టులు ఆడనుంది. తొలి రెండు టెస్టులు చెన్నై వేదికగా జరగనున్నాయి.

జట్టు వివరాలు

ఇవీ చదవండి

గబ్బా కోటకు టీమ్‌ఇండియా బీటలు

మాటల్లో చెప్పలేను: రహానె

ఆసీస్‌ పొగరుకు, గర్వానికి ఓటమిది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని