KKR vs DC: దిల్లీ క్యాపిటల్స్‌ జోరుకు బ్రేకులేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

తాజా వార్తలు

Updated : 28/09/2021 19:31 IST

KKR vs DC: దిల్లీ క్యాపిటల్స్‌ జోరుకు బ్రేకులేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

షార్జా: వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతున్న దిల్లీ జోరుకు కోల్‌కతా బ్రేక్‌లు వేసింది. తొలుత బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో కోల్‌కతా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌ 18.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్‌ గిల్‌ (30), నితీశ్‌ రాణా (36*), సునీల్‌ నరైన్‌ (21) రాణించడంతో కోల్‌కతా సునాయాసంగా విజయం సాధించింది. దిల్లీ బౌలర్లు ఆఖరులో వికెట్లు తీసినా... అప్పటికే కోల్‌కతా విజయం ఖాయమైంది. దిల్లీ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ 3... అన్రిచ్‌ నోర్జ్‌, అశ్విన్, లలిత్‌ యాదవ్‌, కగిసో రబాడా తలో వికెట్‌ తీశారు. 

కీలక సమయాల్లో వికెట్లు తీసి...

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (39; 34 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (39; 36 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ఐదో ఓవర్‌లో దిల్లీ మొదటి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (24; 20 బంతుల్లో 5 ఫోర్లు)ను ఫెర్గూసన్‌ ఔట్‌ చేశాడు. తర్వాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(1)ని సునీల్‌ నరైన్‌ పెవిలియన్ చేర్చాడు. చక్రవర్తి వేసిన పదో ఓవర్లో స్మిత్ రెండు ఫోర్లు బాదాడు. ప్రమాదకరంగా మారుతున్న స్మిత్‌ని ఫెర్గూసన్‌ ఔట్‌ చేశాడు. హెట్‌మయర్ (4), లలిత్‌ యాదవ్‌(0), అక్షర్ పటేల్‌(0), అశ్విన్‌(9) నిరాశపర్చారు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో దిల్లీ భారీ స్కోరు చేయలేకపోయింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్‌, ఫెర్గూసన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సౌథీ ఒక వికెట్ తీశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని