close

తాజా వార్తలు

Updated : 28/02/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు అవకాశమివ్వండి: కేటీఆర్‌ 

(Photo:Minister for IT, Industries, MA & UD, Telangana twitter)

హైదరాబాద్‌: వచ్చే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంను ఒక వేదికగా చేర్చాలని తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకులను కోరారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌-19 నియంత్రణలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల కన్నా హైదరాబాద్‌ ముందుందని చెప్పారు. అందుకు ఇక్కడ నమోదవుతున్న అత్యల్ప కేసుల సంఖ్యే నిదర్శనమన్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉప్పల్‌లో నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.

కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ సుమారు ఆరు నెలలు వాయిదా పడి చివరికి సెప్టెంబర్‌లో యూఏఈకి తరలిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ కఠిన ఆంక్షల నడుమ బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది. అయితే, ఈసారి వేసవిలోనే స్వదేశంలోనే నిర్వహించాలని చూస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఆరు ప్రధాన నగరాలను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ జాబితాలో చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీ నగరాల పేర్లు ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ముంబయిని మరో వేదికగా ఎంపిక చేసే వీలుంది. ఒకవేళ అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడానికి అనుకూలంగా లేకపోతే హైదరాబాద్‌కు అవకాశం దక్కొచ్చని వినికిడి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ ఏం చేస్తుందో వేచి చూడాలి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని