రెండో టెస్టు: అతడికి చోటిచ్చి తీరాల్సిందే

తాజా వార్తలు

Published : 11/02/2021 01:25 IST

రెండో టెస్టు: అతడికి చోటిచ్చి తీరాల్సిందే

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌కు కచ్చితంగా అవకాశం ఇవ్వాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. జట్టు కూర్పు కుదరకపోతే వాషింగ్టన్‌ స్థానంలో అక్షర్‌కు చోటివ్వాలని అన్నాడు. చెపాక్‌లో తర్వాతి టెస్టులో టాస్‌కు ప్రాధాన్యం ఉండకపోవచ్చని వెల్లడించాడు.

చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌కు గతేడాది నుంచి జట్టులో చోటు దక్కడం లేదు. జట్టు కూర్పు కుదురకపోవడం ఒక కారణమైతే.. ఫామ్‌ కోల్పోవడం మరో కారణం. ఆసీస్‌ పర్యటనకూ అతడిని ఎంపిక చేసినా తుది జట్టులో చోటివ్వలేదు. భారత్‌లోనైనా ఇస్తారేమోనని అంచనా వేశారు. అప్పటికే వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకోవడంతో ఆఫ్‌స్పిన్నర్‌ తరహా బౌలింగే కావడంతో చోటివ్వలేదని కోహ్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో షాబాజ్‌ నదీమ్‌, సుందర్‌ భారీగా పరుగులు ఇవ్వడం చేటు చేసింది.

‘తర్వాతి మ్యాచులో నదీమ్‌ బదులు కుల్‌దీప్‌ను ఆడించాలి. నా ఉద్దేశం ప్రకారం అతడు తొలి మ్యాచులోనూ ఆడాల్సింది. కానీ చోటివ్వలేదు. అది సరికాదు. ఇప్పటికైనా ఆడించాలి. రెండో టెస్టులో టాస్‌కు ప్రాధాన్యం లేని పిచ్‌ను రూపొందించొచ్చు. అంటే టాస్‌ ఓడిపోయినా మ్యాచు ఏదో ఒకవైపు సాగదు. బహుశా తొలిరోజు నుంచే బంతి టర్న్‌ అయ్యే పిచ్‌ను తయారు చేస్తుండొచ్చు. ఏదేమైనా భారత జట్టులో కుల్‌దీప్‌ ఉండాలి. కావాలంటే సుందర్‌ బదులు అక్షర్‌ను ఆడించండి. తొలి టెస్టులో అతడు 85*తో నిలిచినా నేనిదే మాట చెబుతాను. ఎందుకంటే మూడో టెస్టులో అతడిని ఆడించరు’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

ఇవీ చదవండి
ఓటమిపై సాకులొద్దు.. పునఃసమీక్షించండి
రూట్‌ పైపైకి.. కోహ్లీ కిందకు..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని