అక్షర్‌ అరంగేట్రం.. రెండేళ్ల తర్వాత కుల్‌దీప్‌ 

తాజా వార్తలు

Updated : 13/02/2021 11:35 IST

అక్షర్‌ అరంగేట్రం.. రెండేళ్ల తర్వాత కుల్‌దీప్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగింది. తొలి టెస్టులో బ్యాట్‌తో అదరగొట్టి బంతితో విఫలమైన వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఏడేళ్లకు అతడు టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. దీంతో భారత్‌ తరఫున 302వ టెస్టు ఆటగాడిగా అక్షర్‌ పటేల్‌.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేతుల మీదుగా క్యాప్‌ అందుకున్నాడు. 

మరోవైపు తొలి టెస్టులో పూర్తిగా విఫలమైన నదీమ్‌కు బదులు ఈ మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను తీసుకున్నారు. తొలి టెస్టులోనే అతడికి అవకాశం వస్తుందని భావించినా అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. టీమ్‌ఇండియా అనూహ్యంగా నదీమ్‌ను తీసుకొని షాకిచ్చింది. అయితే, అతడు రాణించకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం ఎట్టకేలకు కుల్‌దీప్‌ యాదవ్‌కు అవకాశమిచ్చింది. అతడు చివరిసారి 2019 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో ఆడాడు.

ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్‌ బుమ్రాకు పనిభారం ఎక్కువ అవుతుందనే ఆలోచనతో ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన మహ్మద్‌ సిరాజ్‌ను తీసుకున్నట్లు కెప్టెన్‌ కోహ్లీ చెప్పాడు. కాగా, టీమ్‌ఇండియా టెస్టు ఛాంపియన్‌ షిప్‌ పోటీలో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇవీ చదవండి..
సమాజానికి ఏమైంది.. మనం ఎటు పోతున్నాం 
మీకు మసాలా దొరకదు: అజింక్య ఆవేశం!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని