IPL: కొవిడ్‌ టీకాకు భయపడ్డ క్రికెటర్లు!
close

తాజా వార్తలు

Published : 15/05/2021 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL: కొవిడ్‌ టీకాకు భయపడ్డ క్రికెటర్లు!

బయో బుడగే సురక్షితమని భావించిన ఆటగాళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సంబంధించి మరో విషయం బయటపడింది. సీజన్‌కు ముందు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇప్పిస్తామంటే ఆటగాళ్లు తిరస్కరించారని సమాచారం. టీకా తీసుకుంటే జ్వరం వస్తుందని ఆందోళన చెందారట. అత్యంత పటిష్ఠమైన బయో బుడగలో ఉంటున్నాం కాబట్టి భయం లేదని భావించారని తెలిసింది.

కరోనా వైరస్‌ వెంటాడటంతో ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. సీజన్‌లో 29 మ్యాచులు ముగిశాక ఆటగాళ్లు మహమ్మారి బారిన పడ్డారు. కోల్‌కతాలో వరుణ్ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌, హైదరాబాద్‌లో వృద్ధిమాన్‌ సాహా, దిల్లీలో అమిత్‌ మిశ్రా, కోల్‌కతాలో లక్ష్మీపతి బాలాజీ, మైక్‌ హస్సీ పాజిటివ్‌గా తేలారు. బుడగ బలహీనమవ్వడంతో సీజన్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. ఆ తర్వాతా మరికొందరు ఆటగాళ్లు, సిబ్బందికి పాజిటివ్‌ రావడం గమనార్హం.

‘టీకా తీసుకోవడానికి ఆటగాళ్లు నిరాకరించారు. ఇది వారి తప్పేమీ కాదు. అవగాహన లేకపోవడమే కారణం. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం క్రికెటర్లను ఒప్పించాయి. చాలామంది జ్వరం వస్తుందని భయపడ్డారు. బయో బుడగ సురక్షితమే కాబట్టి టీకా అవసరం లేదని భావించారు. యాజమాన్యాలు సైతం ఒత్తిడి చేయలేదు. ఆ తర్వాత పరిస్థితి చేజారింది. విదేశీ ఆటగాళ్లు, సిబ్బంది తీసుకోవడానికి ముందుకొచ్చినా వారికి వేయించడం చట్టబద్ధం కాదు. దాంతో కుదర్లేదు’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

బుడగలో లోపాలున్నాయని ఫ్రాంచైజీలు భావించాయని తెలిసింది. ఆటగాళ్లను ప్రత్యేక ఛార్టర్‌ విమానాల్లోనే మిగతా వేదికల వద్దకు తీసుకెళ్లారు. అయితే విమానాశ్రయాల్లో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, ఇతరులు ఎక్కువ మందే ఉన్నారట. అందులో ఎవరెవరు వ్యాక్సిన్‌ వేయించుకున్నారో లేదో తెలియదు. పైగా ఇతర సిబ్బంది పరిస్థితీ తెలియదని ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని