సంజనకు బదులు సంజయ్‌ బంగర్‌ను ట్యాగ్‌ చేసి..

తాజా వార్తలు

Published : 16/03/2021 12:16 IST

సంజనకు బదులు సంజయ్‌ బంగర్‌ను ట్యాగ్‌ చేసి..

 తప్పులో కాలేసిన మయాంక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా సోమవారం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ క్రీడాఛానల్‌లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంజన గణేశన్‌తో గోవాలో ఏడడుగులు వేశాడు. ఈ విషయాన్ని బుమ్రా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఇక్కడే టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ తప్పులో కాలేశాడు.

కొత్త దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ మయాంక్‌ ఓ ట్వీట్‌ చేశాడు. అందులో బుమ్రా, సంజనను ట్యాగ్‌ చేసే క్రమంలో సంజనకు బదులు టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ను ట్యాగ్‌ చేశాడు. జరిగిన పొరపాటును గ్రహించిన మయాంక్‌ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజెన్లు కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను ఆటపట్టిస్తున్నారు.

మరోవైపు బుమ్రా దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ హనీమూన్‌ డెస్టినేషన్‌ను కూడా ఫిక్స్‌ చేసింది. ‘కంగ్రాట్స్‌ బుమ్రా, సంజన. ఏప్రిల్‌, మేలో మాల్దీవ్స్‌ బాగుంటాయని మేం విన్నాం’ అని ట్వీట్‌ చేసింది. మరి బుమ్రా అక్కడికి వెళ్తాడో లేదో చూడాలి. ఎందుకంటే వచ్చేనెల నుంచే ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభంకానుంది. ఏప్రీల్‌ 9 నుంచి మే 30 వరకు భారత్‌లోనే ఆరు వేదికల్లో మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని