సురక్షితంగా బయో బుడగల్లో..: డికాక్

తాజా వార్తలు

Published : 01/05/2021 01:13 IST

సురక్షితంగా బయో బుడగల్లో..: డికాక్

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి నానాటికీ పెరిగిపోతోంది. దీని ప్రభావం ఐపీఎల్‌పై కూడా పడుతోంది. ఆటగాళ్లు, సిబ్బంది కొవిడ్ బారిన పడకుండా ఉండటానికి బయో బుడగలను ఏర్పర్చి కఠిన నిబంధనలను అమలు చేస్తూ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే, కొంతమంది ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి వైదొలుగుతుంటే, మరికొంత బయో బుడగల్లో ఉండలేక నిష్క్రమిస్తున్నారు. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్‌ (దిల్లీ క్యాపిటల్స్‌), లివింగ్ స్టోన్‌(రాజస్థాన్ రాయల్స్‌), ఆడమ్‌ జంపా(ఆర్సీబీ), కేన్‌ రిచర్డ్‌సన్(ఆర్సీబీ) లీగ్ నుంచి వైదొలిగారు. 

ఆటగాళ్లు ఉంటున్న బయోబుడగలు సురక్షితం కావని, గతేడాది మాదిరిగా ఈ సారి కూడా ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహిస్తే బాగుండేదని ఇటీవల ఆడమ్ జంపా వ్యాఖ్యానించాడు. అనంతరం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ముంబయి ఇండియన్స్‌ ఓపెనర్ క్వింటన్ డికాక్ బయో బుడగల విషయంపై మాట్లాడాడు.

బయోబబుల్‌, ఆటగాళ్లను పర్యవేక్షించే వైద్యులపై పూర్తినమ్మకం ఉన్నందున ఐపీఎల్ నుంచి వైదొలగాలనే ఆలోచనలు లేవని డికాక్‌ పేర్కొన్నాడు. ‘‘నిజం చెప్పాలంటే మేం మా వైద్యులపై నమ్మకం ఉంచాం. మా బయోబుడగలో మేం చాలా సురక్షితంగా ఉన్నాం. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నేను సురక్షితంగానే ఉన్నా. ఇతర ఆటగాళ్ల గురించి నాకు తెలీదు.  ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎలాంటి ఆందోళన లేకుండా నమ్మకంతో ఉంటే ఆటలో రాణించవచ్చు. ఇది అన్నివిధాల మంచిది కూడా’’ అని క్వింటన్ డికాక్‌ అన్నాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని