‘పొలి’ కేక × డు..డు.. రాయుడు ‘ఢీ’

తాజా వార్తలు

Published : 03/05/2021 01:15 IST

‘పొలి’ కేక × డు..డు.. రాయుడు ‘ఢీ’

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌-21లో అత్యుత్తమ మ్యాచుకు వేదికగా నిలిచింది దిల్లీ. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ శనివారం హోరాహోరీగా తలపడ్డాయి. మొదట ధోనీసేన 218 పరుగులు చేయగా రోహిత్‌ బృందం ఆఖరి బంతికి ఆ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం అందుకుంది. 30 సిక్సర్లు.. 30 బౌండరీలు నమోదైన ఈ పోరులో డుప్లెసిస్‌, మొయిన్ అలీ, అంబటి రాయుడు, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య కీలకంగా ఆడారు. మరి ఎవరి ఆటకు మీరు ఎంత రేటింగ్‌ ఇస్తారు?

పొలార్డ్‌: ముంబయి 219 పరుగులు ఛేదించేందుకు ఏకైక కారణం కీరన్‌ పొలార్డ్‌. కేవలం 34 బంతుల్లో 6 బౌండరీలు, 8 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. ఆఖరి వరకు నిలిచి జట్టుకు విజయం అందించాడు. అతడి వీర బాదుడుకు దిల్లీలో మోత మోగింది. ఇక సీఎస్‌కే బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న వేళ బంతితోనూ ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్‌, రైనాను ఔట్‌ చేశాడు.

కృనాల్‌ పాండ్య: ముంబయి ఓపెనర్లు డికాక్‌ (38), రోహిత్‌ (35) శుభారంభమే అందించినా భారీ ఛేదనలో ఆ జట్టుకు మంచి భాగస్వామ్యం అవసరమైంది. వికెట్లు పడకుండా అడ్డుకుంటూనే పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కృనాల్‌ కీలక పాత్ర పోషించాడు. 23 బంతుల్లో 2 బౌండరీలు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. అంతే కాకుండా పొలార్డ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 89 (44 బంతుల్లో) పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు.

అంబటి రాయుడు: తనదైన రోజున ఈ హైదరాబాదీ క్రికెటర్‌ ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో అందరికీ తెలిసిందే. ఈ పోరులో అతడు 27 బంతుల్లో 7 సిక్సర్లు, 4 బౌండరీలతో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. సీఎస్‌కేకు శుభారంభమే లభించినా.. మధ్యలో ముంబయి పుంజుకుంది. స్కోరు చేయకుండా అడ్డుకుంది. ఈ క్రమంలో రాయుడే.. స్కోరును 200 దాటించాడు.

డుప్లెసిస్, మొయిన్‌ అలీ:  మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై తొలి ఓవర్లో 4 పరుగుల వద్దే రుతురాజ్‌ (4) వికెట్‌ కోల్పోయింది. ఒత్తిడిలో పడ్డ ఆ జట్టుకు వీరిద్దరూ రెండో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం అందించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొదట మొయిన్‌ (58; 36 బంతుల్లో 5×4, 5×6) చితక బాదితే ఆ తర్వాత డుప్లెసిస్‌ (50; 28 బంతుల్లో 2×4, 4×6) జోరందుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని