వాళ్లను ఓడిస్తే టీమ్‌ఇండియాదే ప్రపంచకప్‌‌

తాజా వార్తలు

Published : 22/03/2021 12:50 IST

వాళ్లను ఓడిస్తే టీమ్‌ఇండియాదే ప్రపంచకప్‌‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్ జట్టని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ అథర్టన్‌ అభిప్రాయపడ్డాడు. జట్టులో నైపుణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదని, అలాగే స్వదేశంలో ఆడుతుండడం కూడా కోహ్లీసేనకు కలిసివస్తోందని చెప్పాడు. తాజాగా టీమ్‌ఇండియా పొట్టి సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన నేపథ్యంలో ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘ఐపీఎల్‌ వల్ల టీమ్‌ఇండియాకు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ దొరికింది. మరో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. అదిప్పుడే ఇంగ్లాండ్‌వంటి నంబర్‌ వన్‌ జట్టును ఓడించింది. అది కూడా బుమ్రా, షమి, జడేజాలాంటి కీలక ఆటగాళ్లు లేకుండానే. ఇవన్నీ పక్కనపెడితే పొట్టి ప్రపంచకప్‌ను స్వదేశంలో ఆడుతుండటం టీమ్‌ఇండియాకు సానుకూలాంశం. ఇలాంటి పరిస్థితుల్లో అదే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే.. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ వంటి జట్లు కూడా ప్రమాదకరమైనవే. వాటిని ఓడిస్తే.. టీమ్‌ఇండియా కచ్చితంగా ఫేవరెట్‌’ అని అథర్టన్‌ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా ఇప్పటికే ఇంగ్లాండ్‌ను అటు టెస్టుల్లో, ఇటు టీ20ల్లో ఓడించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. దీంతో అది కూడా విజయం సాధించి తర్వాత ఐపీఎల్‌కు వెళ్లాలని చూస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని