ఈ టెస్టులో ఎవరూ గెలవలేదు..: వాన్‌
close

తాజా వార్తలు

Updated : 27/02/2021 14:11 IST

ఈ టెస్టులో ఎవరూ గెలవలేదు..: వాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియాది మామూలు విజయమని.. అసలా టెస్టులో ఎవరూ గెలవలేదని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ అన్నాడు. మొతేరా స్టేడియంలో జరిగిన ఈ మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడంపై అతడు మొదటి నుంచీ విమర్శలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘టీమ్‌ఇండియా ఇష్టమొచ్చినట్లు చేయడానికి ఐసీసీ అనుమతిస్తుంది. దాంతో అంతిమంగా టెస్టు క్రికెట్‌కు నష్టం జరుగుతోంది. తొలి టెస్టు తర్వాత కోహ్లీసేన 1-0 తేడాతో వెనుకబడ్డాక.. మిగతా టెస్టులకు తొలి బంతి నుంచే పిచ్‌ స్పందించేలా రూపొందించడం మనం చూస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా మూడో టెస్టులో విజయం సాధించింది. అది నిస్సారమైన గెలుపని అనుకుంటున్నాను. ఇందులో ఏ జట్టూ విజయం సాధించలేదు. అయితే, స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై టీమ్ఇండియా కచ్చితంగా మంచి ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్‌ కన్నా బాగా ఆడింది. ఈ విషయం ఒప్పుకోక తప్పదు. కానీ, ఆటలో మంచి విషయాన్నే గ్రహించాలి. మాజీ ఆటగాళ్లుగా ఆ బాధ్యత మాపై ఉంది’ అని వాన్‌ వివరించాడు.

అలాగే ఈ సిరీస్‌ ద్వారా ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కొంతమంది తమ కెరీర్లకు పునాదులు వేసుకోవాలని చూస్తున్నారని, గత రెండు టెస్టుల పిచ్‌లు చూస్తుంటే ఆయా క్రికెటర్లు నిరుత్సాహానికి గురయ్యారని వాన్‌ చెప్పుకొచ్చాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో అదృష్టం కొద్ది పరుగులు సాధించే విధంగా పరిస్థితుల్ని కల్పించుకోవడం టెస్టు క్రికెట్‌ కాదని వాన్‌ తీవ్రంగా స్పందించాడు. ఇలాంటి పిచ్‌లతో టెస్టు ఛాంపియన్‌షిప్‌కు పోటీపడితే ఆ పాయింట్లను తొలగించాలని సూచించాడు. ఇక చివరగా ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల రొటేషన్‌ పద్ధితిని కూడా వాన్‌ తప్పుబట్టాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని