Covid: మిల్కాసింగ్‌ డిశ్చార్జి

తాజా వార్తలు

Published : 31/05/2021 01:05 IST

Covid: మిల్కాసింగ్‌ డిశ్చార్జి

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల కొవిడ్‌ బారిన పడిన లెజెండరీ భారత స్ప్రింటర్‌ మిల్కా సింగ్‌ (91) ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ఆయనను డిశ్చార్జి చేసినట్లు మొహాలీలో ఆయన చికిత్స తీసుకున్న ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అందులో పేర్కొంది. ఆక్సిజన్‌ అవసరం పెరగడంతో మిల్కా సింగ్‌ భార్యను శనివారం సాయంత్రం ఐసీయూకి తరలించామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని వెల్లడించింది. మిల్కా సింగ్‌కు ఈ నెల 20న కరోనా పాజిటివ్‌గా తేలింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని