Shafali Verma: ఆమె ఉండటం ప్లస్సే: మిథాలి

తాజా వార్తలు

Published : 01/06/2021 16:47 IST

Shafali Verma: ఆమె ఉండటం ప్లస్సే: మిథాలి

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా జట్టు యువ ఓపెనర్‌ షెఫాలి వర్మ మూడు ఫార్మాట్లలో చోటు సంపాదించుకోవడం మంచిదని, అది తమ జట్టుకు కలిసివస్తుందని కెప్టెన్‌ మిథాలి రాజ్‌ అభిప్రాయపడింది. ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన ఆమె షఫాలీని తగిన రీతిలో ప్రోత్సహించాల్సిన అవసరముందని చెప్పింది.

‘మూడు ఫార్మాట్లలోనూ షఫాలీ ఉండటం కచ్చితంగా మాకు కలిసివస్తుంది. భవిష్యత్తులో తనను తాను ఎలా తీర్చిదిద్దుకుంటుందనే విషయంపై మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. యువ క్రికెటర్లతో మా అనుభవాలు పంచుకోవడం ఒక విషయమైతే, వాళ్లని తగిన విధంగా ప్రోత్సహించి అత్యుత్తమంగా ఆడేలా కృషి చేయడం కూడా అంతే ముఖ్యం. అలాంటి వారికి తగినంత స్వేచ్ఛనిచ్చి మెరుగ్గా ఆడేలా ప్రోత్సహించడమే కాక, వారు విఫలమైనప్పుడు వెన్నుతట్టి అండగా నిలిచే బాధ్యత కూడా సీనియర్లు తీసుకోవాలి. వాళ్లు చేయాల్సింది ఇదే. అయితే ఈ ప్రయాణంలో యువ క్రికెటర్లు కూడా తమ సొంత అడుగులు వేసేలా ప్రయత్నించాలి’’ అని టీమ్‌ఇండియా కెప్టెన్‌ వివరించింది.

మరోవైపు గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఏడాది పాటు ఆటకు దూరమైన మహిళా జట్టు మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఆడిన వన్డే, టీ20 సిరీస్‌లో ఓటమిపాలైంది. దాంతో ఎలాగైనా రాబోయే ఇంగ్లాండ్‌ పర్యటనలో గాడిన పడాలని చూస్తున్నామని మిథాలి పేర్కొంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ ఉన్నందున ఇకపై విజయాలు సాధించాల్సిన అవసరం ఉందని చెప్పింది. తమ జట్టులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలని మిథాలి తెలిపింది. ఒకసారి జట్టు విజయపథంలోకి వస్తే ఉన్నత స్థాయిలో రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న టీమ్‌ఇండియా బుధ లేదా గురువారం ఇంగ్లాండ్‌కు బయలుదేరనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని