MIvsRCB:ముంబయి ఇండియన్స్ లక్ష్యం 166

తాజా వార్తలు

Published : 26/09/2021 21:22 IST

MIvsRCB:ముంబయి ఇండియన్స్ లక్ష్యం 166

ఇంటర్నెట్‌ డెస్క్‌: దుబాయ్‌ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (51; 42 బంతుల్లో 3×4, 3×6), మ్యాక్స్‌వెల్  (56; 37 బంతుల్లో 6×4, 6×3) రాణించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు..బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ పడిక్కల్‌(0) వికెట్‌ని కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్‌ భరత్‌ (32; 24 బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనింపించాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో కోహ్లి ఓ సిక్స్‌, ఫోర్‌ బాదగా.. శ్రీకర్‌ బౌండరీ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. అనంతరం ఆడమ్‌ మిల్నే వేసిన ఓవర్‌లో విరాట్‌ మరో సిక్స్‌, ఫోర్‌ బాదాడు. ప్రమాదకరంగా మారుతున్న శ్రీకర్‌ని 9వ ఓవర్‌లో రాహుల్‌ చాహర్‌ పెవిలియన్‌కి పంపించాడు. బౌల్ట్‌ వేసిన 15వ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. తర్వాతి మిల్నే వేసిన ఓవర్‌లో విరాట్‌ ఔటైన తర్వాత మ్యాక్స్‌వెల్‌ జోరు పెంచాడు. మిల్నే వేసిన 18వ ఓవర్లో ఓ సిక్స్‌, రెండు ఫోర్లు బాదాడు. 19వ ఓవర్‌ వేసిన బుమ్రా.. మ్యాక్స్‌వెల్, డివిలియర్స్‌(11) వరుస బంతుల్లో ఔట్‌ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బౌల్ట్‌ వేసిన చివరి ఓవర్‌లో షాబాబ్‌ అహ్మద్‌ (1) పెవిలియన్ చేరాడు. క్రిస్టియాన్‌(1), జేమీసన్‌(2) నాటౌట్‌గా నిలిచారు.ముంబయి బౌలర్లలో బుమ్రా మూడు, రాహుల్‌ చాహర్‌, మిల్నే, బౌల్ట్‌ తలో వికెట్‌ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని