MIvsRCB:టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌

తాజా వార్తలు

Published : 26/09/2021 19:10 IST

MIvsRCB:టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ మరో ఆసక్తికరమైన సమరం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచి ముంబయి..తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఈ ఇరుజట్లు ఈ సీజన్‌ రెండో దశలో ఇప్పటివరకు విజయం సాధించలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూశాయి. ముంబయి ఇండియన్స్‌కి ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ఇందులో నెగ్గితేనే ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. బెంగళూరు ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. చూడాలి మరి విజయం ఏ జట్టు వరిస్తుందో.

ముంబయి ఇండియన్స్‌ జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్), క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్ పాండ్య, ఆడమ్‌ మిల్నె, రాహుల్‌ చాహర్‌, జస్ప్రీత్‌ బుమ్రా,ట్రెంట్‌ బౌల్ట్‌.

బెంగళూరు జట్టు:
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌),దేవదత్‌ పడిక్కల్, శ్రీకర్‌ భరత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, షాబాజ్ అహ్మద్‌, డేనియల్‌ క్రిస్టియాన్‌, జేమీసన్‌, హర్షల్ పటేల్‌, యుజవేంద్ర చాహల్‌, సిరాజ్‌.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని