WTC Final: ఐసీసీకి మద్దతుగా అజ్జూ ట్వీట్‌!
close

తాజా వార్తలు

Published : 23/06/2021 01:28 IST

WTC Final: ఐసీసీకి మద్దతుగా అజ్జూ ట్వీట్‌!

టెస్టుల్లో డ్రా అనేది ఉంది కదా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగుతున్న తీరుకు అభిమానుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రిజర్వ్‌ డే ఉన్నప్పటికీ నిర్దిష్టంగా ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వరుసగా వర్షం కురుస్తుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో రోజు 90 ఓవర్ల చొప్పున పూర్తి 450 ఓవర్ల ఆటను కొనసాగించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఎక్కువ రోజులైనా ఫర్వాలేదని అంటున్నారు.

ఇలాంటి డిమాండ్‌ను టీమ్‌ఇండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌ కొట్టిపారేశారు. అలా జరిగితే ఇక ఐదురోజుల మ్యాచ్‌ అనడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. ‘ఒక టెస్టు మ్యాచ్‌ను బౌలింగ్‌ చేసిన ఓవర్ల ఆధారంగా నిర్ణయిస్తే ఇక దానిని ఐదు రోజుల మ్యాచ్‌గా అసలు పిలవకూడదు. నిజానికి ఐసీసీ రిజర్వ్‌ డేను ప్రకటించడమే గొప్ప నిర్ణయం. సుదీర్ఘ ఫార్మాట్‌లో డ్రా అనే ఫలితం ఎప్పట్నుంచో ఉంది’ అని అజ్జూ ట్వీట్‌ చేశారు.

ఉత్కంఠగా సాగుతోందని భావించిన ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ వర్షం కారణంగా సవ్యంగా సాగడం లేదు. అభిమానులు సహా మాజీ క్రికెటర్లు ఐసీసీ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో ఎందుకు మ్యాచ్‌లు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఐదు రోజుల మ్యాచ్‌లో రెండు రోజులు పూర్తిగా వర్షార్పణం అయ్యాయి. రెండు రోజులు ఆట పూర్తిగా సాధ్యపడలేదు. వెలుతురు లేమితో సెషన్ల కొద్దీ ఆట జరగలేదు. మంగళ, బుధవారాల్లో ఆట సవ్యంగా సాగితే విజేత ఎవరో తేలేందుకు అవకాశం ఉండొచ్చు!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని