Cricket News: అజ్జూభాయ్‌కు గుర్తుకొస్తున్నాయి!

తాజా వార్తలు

Published : 05/06/2021 14:40 IST

Cricket News: అజ్జూభాయ్‌కు గుర్తుకొస్తున్నాయి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ తన క్రికెటింగ్‌ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. నెల రోజులుగా ఆయన సోషల్‌ మీడియా వేదికగా వీటిని అభిమానులతో పంచుకుంటున్నారు. కెరీర్‌ తొలినాళ్లలో తన ప్రతిభను గుర్తించి తనకు ఇచ్చిన స్కూటర్‌ గురించి శుక్రవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ఇప్పటికీ ఆ స్కూటర్‌ చెక్కుచెదరకుండా అందంగా కనిపించడం గమనార్హం.

‘నా కెరీర్‌ తొలినాళ్లలోని మధుర జ్ఞాపకాలివి. నా ప్రతిభకు గుర్తుగా ఈ స్కూటర్‌ను అందుకున్నాను. మొదట్లో ఉదయం, సాయంత్రం సాధన చేసేందుకు నేను సైకిల్‌పై లేదా నడుచుకుంటూ స్టేడియాలకు వెళ్లేవాడిని. వాటితో పోలిస్తే ఈ స్కూటర్‌ నాకెంతో సౌలభ్యం కలగజేసింది’ అని అజ్జూ భాయ్‌ ఆ స్కూటర్‌ చిత్రాలను ట్విటర్లో పంచుకున్నారు. అంతకు ముందూ ఆయన తన బ్యాటు గురించి ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

‘ఈ బ్యాటుతో 1984-85లో ఇంగ్లాండ్‌పై నా తొలి మూడు టెస్టుల్లో వరుసగా శతకాలు బాదాను. ప్రపంచ రికార్డు నెలకొల్పాను. ఒక సీజన్లో 800+ పరుగులు సాధించాను. ఈ బ్యాటును ఎంపిక చేసింది మా తాతయ్య’ అని అజహర్‌ ట్వీటారు. ఈ వారంలోనే ఇంగ్లాండ్‌తో 1999 వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌ గురించీ వివరించారు. వాతావరణం బాగాలేకపోవడంతో రెండోరోజు కొనసాగించిన ఆ మ్యాచులో టీమ్‌ఇండియా విజయం సాధించిందని చెప్పారు. ఆ మ్యాచులో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎవరో చెప్తారా? అని ప్రశ్నించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని