Shivraj Singh chauhan: నీరజ్‌కు ప్రశంసలు.. హాకీ మహిళా జట్టుకు నగదు బహుమతి..!

తాజా వార్తలు

Published : 08/08/2021 18:00 IST

Shivraj Singh chauhan: నీరజ్‌కు ప్రశంసలు.. హాకీ మహిళా జట్టుకు నగదు బహుమతి..!

భోపాల్‌: టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం సాధించిపెట్టిన జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రాపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ ప్రశంసలు కురిపించారు. పతకం సాధించలేకపోయినా అత్యుత్తమ ప్రదర్శన చేసిన హాకీ మహిళా జట్టుకు నగదు బహుమతి ప్రకటించారు. ‘‘నీరజ్‌ చరిత్ర సృష్టించాడు. అతడి నిరంతర కృషి, పట్టుదల అభినందనీయం. దేశం అతడిని చూసి గర్విస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో మన హాకీ మహిళా జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసింది. తృటిలో పతకం చేజార్చుకున్నప్పటికీ.. వారు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. భవిష్యత్తులో వారు తప్పక విజయం సాధిస్తారు. జట్టు సభ్యులకు ఒక్కొక్కరికీ రూ.31 లక్షల చొప్పున నగదు బహుమతిని అందజేస్తాం. ’’ అని పేర్కొన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్‌ చోప్రా పసిడి పతకం సాధించాడు. వ్యక్తిగత విభాగాల్లో అభినవ్‌ బింద్రా తర్వాత స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా నీరజ్‌ నిలిచాడు. మరోవైపు కాంస్య పతక పోరులో బ్రిటన్‌ చేతిలో భారత హాకీ మహిళా జట్టు 3-4 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో భారత్‌ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో 7 పతకాలు నమోదయ్యాయి.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని