Dhoni: చిన్నిగుర్రంతో ధోనీ ఆటలు..
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 10:18 IST

Dhoni: చిన్నిగుర్రంతో ధోనీ ఆటలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి మళ్లీ ఖాళీ సమయం దొరకడంతో రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో సేదతీరుతున్నాడు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి హాయిగా గడుపుతున్నాడు. కరోనా ఉద్ధృతి కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ధోనీ తిరిగి ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఫామ్‌హౌజ్‌లో పెంచుకుంటున్న మూగజీవాలతో సరదాగా గడిపేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నాడు.

గతనెల ఓ చిన్న గుర్రానికి మసాజ్‌, స్నానం చేయించిన ధోనీ.. తాజాగా మరో చిన్న గుర్రంతో ఆటలాడాడు. దానితో పరుగులు తీస్తున్న వీడియోను అతడి సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా లక్షలాది మంది అభిమానులు లైకులు కొడుతున్నారు. ధోనీ గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సారథిగా కొనసాగాడు. అయితే, అప్పుడా జట్టు సరిగ్గా ఆడకపోవడంతో ప్లేఆఫ్స్‌ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఈసారి సగం టోర్నీ పూర్తయ్యేసరికి చెన్నై ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక సెప్టెంబర్‌లో జరిగే మిగతా సీజన్‌లో ఈ జట్టు ఎలా ఆడనుందో చూడాలి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని