ఎంఎస్‌ ధోనీ S/O సచిన్‌.. టీచర్‌ పోస్టుకు దరఖాస్తు

తాజా వార్తలు

Published : 03/07/2021 15:30 IST

ఎంఎస్‌ ధోనీ S/O సచిన్‌.. టీచర్‌ పోస్టుకు దరఖాస్తు

ముఖాముఖికి పిలిచిన అధికారులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతడి పేరు ఎంఎస్‌ ధోనీ. తండ్రి పేరు సచిన్‌ తెందూల్కర్‌. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. అధికారుల బృందం ముఖాముఖికి ఎంపిక చేసిన 15 మందిలో అతడు ఉన్నాడు. కానీ అతడు ముఖాముఖికి హాజరవ్వలేదు. ఎందుకో తెలుసా? అసలు అలాంటి వ్యక్తి లేనే లేడు కాబట్టి! ఇప్పుడీ వ్యవహారం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో 14,850 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోవడంతో అభ్యర్థులంతా నిరాశకు గురయ్యారు. అదే సమయంలో ఈ వ్యవహారం బయటకు రావడంతో పరిస్థితి చినికి చినికి గాలివానగా మారింది.

రాయ్‌పుర్‌లో ఓ పోస్టుకు మహేంద్రసింగ్‌ ధోనీ పేరుతో దరఖాస్తు వచ్చింది. తండ్రి పేరు సచిన్‌ తెందూల్కర్‌గా అందులో పేర్కొన్నారు. ఇలాంటి పేర్లతో దరఖాస్తు వచ్చినప్పుడు అనుమానించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా ప్రవర్తించారు. అతడితో సహా 15 మందిని శుక్రవారం ముఖాముఖికి ఆహ్వానించారు. ధోనీ రాకపోవడంతో దరఖాస్తులోని మొబైల్‌కు ఫోన్‌ చేయగా.. స్విచ్ఛాప్‌ వచ్చింది. దాంతో పొరపాటు తెలుసుకున్న అధికారులు ఆ దరఖాస్తు నకిలీదని గుర్తించారు.

ఆ దరఖాస్తు ప్రకారం దుర్గ్‌లోని సీఎస్‌వీటీయూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ ధోనీ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఎప్పుడైతే నకిలీ దరఖాస్తు గురించి తెలిసిందో మిగిలిన అభ్యర్థులంతా సోషల్‌ మీడియాలో దాన్ని వైరల్‌ చేశారు. దాంతో ఇప్పుడు అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసలు ఆ దరఖాస్తు ముఖాముఖికి ఎలా ఎంపికైందా అని ఇప్పుడు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని