ధోనీ సలహాలతో రెచ్చిపోయిన నట్టూ
close

తాజా వార్తలు

Published : 07/04/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోనీ సలహాలతో రెచ్చిపోయిన నట్టూ

గత సీజన్లో 71 యార్కర్లు విసిరిన యువ పేసర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీ తనకు విలువైన సలహాలు ఇచ్చారని యువపేసర్‌ నటరాజన్‌ అన్నాడు. నెమ్మది బౌన్సర్లు,  కట్టర్లు ఎక్కువగా వేయాలని సూచించాడని చెప్పాడు. వాటివల్లే గత ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు తీయగలిగానని వెల్లడించాడు. ఆ సీజన్లో ధోనీ, డివిలియర్స్‌ వంటి దిగ్గజాలను నట్టూ పెవిలియన్‌కు పంపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 71 యార్కర్లు విసరడం గమనార్హం.

‘మహీలాంటి వాళ్లతో మాట్లాడటమే గొప్ప విషయం. ఆయన నాతో ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడారు. చక్కగా బౌలింగ్‌ చేస్తున్నావని అన్నారు. అనుభవంతో మరింత మెరుగవుతానని ప్రోత్సహించారు. నెమ్మది బౌన్సర్లు, కట్టర్లు, వైవిధ్యమైన బంతులు వేయాలని సూచించారు. అవి నాకెంతో ఉపయోగపడ్డాయి’ అని నటరాజన్‌ అన్నాడు.

సీఎస్‌కేతో మ్యాచులో ధోనీ వికెట్‌ తీసిన విధానాన్ని నట్టూ గుర్తుచేసుకున్నాడు. ‘నేను వేసిన ఓ బంతిని మహీ 102 మీటర్ల సిక్సర్‌ బాదేశారు. ఆ తర్వాతి బంతికే వికెట్‌ తీశాను (సంబరాలు చేసుకోలేదు). అయినా సరే అంతకు ముందు బంతి గురించే ఆలోచించసాగాను. డ్రస్సింగ్‌ రూమ్‌కు వచ్చాక ఎంతో ఆనందించాను. ఆ మ్యాచ్‌ ముగిశాక ధోనీతో మాట్లాడాను’ అని అతడు తెలిపాడు.

బెంగళూరుతో మ్యాచులో ఏబీ డివిలియర్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు నటరాజన్‌. అదే రోజు అతడు తండ్రయ్యాడు. ఏబీ వికెట్‌ తీసినందుకు చాలా సంతోషం కలిగిందన్నాడు. తనకు బిడ్డ పుట్టిన విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదన్నాడు. మ్యాచ్‌ ముగిశాక అందరికీ చెప్పాలనుకున్నానని వివరించాడు. కానీ మ్యాచ్‌ ముగిసి అవార్డులు ఇచ్చేటప్పుడు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ విషయం అందరికీ చెప్పేశాడని వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని