
తాజా వార్తలు
కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన సంగతి తెలిసిందే. గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసిన అతడితో పాటు మరో అయిదుగురు ఆటగాళ్లను చెన్నై జట్టు వదులుకుంది. అయితే కేదార్‌ను చెన్నై జట్టు పక్కనపెట్టడానికి అతడి ఫామ్ మాత్రమే కారణం కాదని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. అతడికి రూ.7.8 కోట్లు చెల్లించలేకే వదిలేసిందని, అదే రూ.3 లేదా 4 కోట్లు పారితోషకమై రిటైన్డ్ చేసుకునేదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
‘‘చెన్నై సరైన ప్రణాళిక అవలంబిస్తోంది. జట్టును పునరుద్ధరించడమంటే జట్టు మొత్తాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అంతేగాక గత సీజన్లో సీఎస్కే ప్రదర్శన మరీ అంత పేలవంగా లేదు. ఆ జట్టుపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ప్రతిసారీ ప్లేఆఫ్‌కు చేరేవాళ్లు. అందుకే చెన్నై జట్టు పటిష్ఠంగా లేదని, ఆటగాళ్లందరినీ మార్చాలని అందరూ భావించారు. కానీ ఆ జట్టు కేవలం అయిదుగురు ఆటగాళ్లను మాత్రమే వదలుకుంది’’ అని గంభీర్ తెలిపాడు.
‘‘ధోనీ ప్రత్యేకత ఇదే. అతడు మరీ లోతుగా ఆలోచించడు. నిర్దిష్ట సీజన్ వరకు మాత్రమే ఆలోచిస్తాడు. పియూష్ చావ్లాకు అధిక ధర వెచ్చించాల్సి వస్తుందన్న కారణంతోనే విడిచిపెట్టింది. కర్ణ్ శర్మ, ఇమ్రాన్ తాహిర్‌ను అంటిపెట్టుకుంది. కేదార్ జాదవ్ కూడా అంతే. అతడి పారితోషకం వల్లే రిటైన్డ్ చేసుకోలేదు. కేదార్ ధర రూ.3-4 కోట్లు అయితే.. అతడిని ధోనీ మరో సీజన్ వరకు కొనసాగించేవాడు’’ అని పేర్కొన్నాడు.
‘‘మరోవైపు బెంగళూరు పది మంది ఆటగాళ్లను వదులుకుంది. గత సీజన్లో వాళ్లు ప్లేఆఫ్స్‌కు కూడా చేరారు. ఐపీఎల్లో సీఎస్కే విజయంతమవుతుండటానికి కారణం వాళ్ల ఆలోచనలే. జట్టులో ఆడే 11 మంది ఆటగాళ్లతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే అందరి ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తారు. సీఎస్కే, ఆర్సీబీ జట్టుకు తేడా ఇదే’’ అని గంభీర్ అన్నాడు. చెన్నై జట్టు కేదార్ జాదవ్, షేన్ వాట్సన్ (రిటైర్డ్), పియూష్ చావ్లా, మురళీ విజయ్, మోను కుమార్, హర్భజన్ సింగ్‌ను వదిలేసింది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మొయిన్ అలీ, ఉదాన, శివమ్ దూబె, ఉమేశ్ యాదవ్, పవన్ నేగి, గుర్‌కీరత్‌ను విడిచిపెట్టింది. స్టెయిన్ తప్పుకోగా, పార్థివ్ పటేల్ రిటైరయ్యాడు. వచ్చే నెలలో ఐపీఎల్ వేలం జరగనున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మూడు రోజులే అవకాశం
కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్ సాయం: తైబు