Dhoni: వాహ్‌ తలా.. హెయిర్‌స్టైల్‌ అదరగొట్టావ్‌ పో!

తాజా వార్తలు

Published : 30/07/2021 17:47 IST

Dhoni: వాహ్‌ తలా.. హెయిర్‌స్టైల్‌ అదరగొట్టావ్‌ పో!

సరికొత్త లుక్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సరికొత్త లుక్‌లో అదరగొట్టాడు. తన అభిమానులను ఫిదా చేస్తూ కొత్త అవతారంలో కుర్రకారుకి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు. కరోనా కారణంగా మే4న ఐపీఎల్‌ వాయిదా పడటంతో అప్పటి నుంచీ ధోనీ ఇంటివద్దే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం అతడు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ పర్యాటక ప్రాంతానికి కుటుంబంతో సహా విశ్రాంతి కోసం వెళ్లాడు. ఆ తర్వాత నుంచి ధోనీ వేషధారణ సరికొత్తగా మారిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. తాజాగా మరో కొత్త లుక్‌లో అదరగొట్టాడు టీమ్ఇండియా మాజీ సారథి. ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ మహీని యువకుడిలా తీర్చిదిద్దిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ధోనీని ఇలా కొత్తగా తీర్చిదిద్దడాన్ని పూర్తిగా ఆస్వాదించినట్లు ఈ సందర్భంగా వ్యాఖ్యానం జతచేశాడు. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వాటికి అభిమానులు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ మహీ హెయిర్‌ స్టైల్స్‌లో ఇదే ది బెస్ట్‌ అని, వయసు 40 అయినప్పటికీ.. 25 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ డాషింగ్‌ లుక్‌ అదిరిపోయిందని, హెయిర్‌ కట్‌ మీద చేసే ప్రయోగాలు ట్రెండ్‌ సృష్టిస్తాయని అంటున్నారు. కాగా, ధోనీ క్రికెటర్‌గా కెరీర్‌ ఆరంభిస్తున్న రోజుల్లోనే పొడవాటి జట్టుతో ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచీ అతడు ఏ కొత్త లుక్‌లో కనిపించినా అభిమానులు ఇష్టపడుతూనే ఉన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని