రికీ కాదు.. మహీకే!

తాజా వార్తలు

Published : 16/08/2020 00:42 IST

రికీ కాదు.. మహీకే!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఆధునిక క్రికెట్లో దిగ్గజాలకు కొదవలేదు. భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ తరఫున ఎంతోమంది ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌ విభాగాల్లో ఎన్నో ఘనతలు అందుకున్నారు. గత 25 ఏళ్ల కాలంలోని క్రికెటర్లతో ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో జ్యూరీ ఓ వన్డే జట్టును ఎంపిక చేసింది. అది ఆసక్తికరంగా ఉండటంతో ఆసీస్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ స్పందించాడు. ఇంకా ఎవరెవరిని చేరిస్తే బాగుంటుందో, ఎవరిని తొలగించాలో చెప్పాల్సిందిగా అతడు కోరాడు.

క్రిక్‌ఇన్ఫో ప్రకటించిన ఈ వన్డే జట్టుకు నాయకుడు ఎంఎస్‌ ధోనీ కావడం గమనార్హం. అయితే వన్డేల్లో రెండుసార్లు ప్రపంచకప్‌లను అందించిన రికీపాంటింగ్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. అయితే ఐసీసీ మెగాటోర్నీలన్నీ గెలిచిన రికార్డు ధోనీకి ఉంది. పైగా అతడి నాయకత్వ ప్రతిభకు ఫిదా కానివారు లేరు. కాగా వికెట్‌ కీపర్‌గా మహీని కాకుండా ఆసీస్‌ ఆటగాడు గిల్‌క్రిస్ట్‌ను ఎంచుకున్నారు. ఓపెనర్‌ కూడా అతడే. తోడుగా టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్‌ ఉన్నాడు.

మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలకడ, విధ్వంసాలకు మారుపేరైన విరాట్‌ కోహ్లీ, బ్రియన్‌ లారా, ఏబీ డివిలియర్స్‌కు చోటిచ్చారు. ఆరో స్థానంలో ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ ఉన్నాడు. అతడు పేస్‌ బౌలింగ్‌తోనూ ఆకట్టుకొనే సంగతి తెలిసిందే. ధోనీ ఏడో స్థానంలో వస్తాడు. పేస్‌ బృందాన్ని పాక్‌ మాజీ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌, ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మెగ్‌గ్రాత్‌ నడిపిస్తారు. స్పిన్‌ విభాగాన్ని షేన్‌వార్న్‌, ముత్తయ్య మురళీధరన్‌ చూసుకుంటారు. కాగా ధోనీ స్థానంలో పాంటింగ్‌ను ఎంపిక చేస్తే బాగుండేదని ఎక్కుమంది రీట్వీట్లు చేశారు. ఈ జట్టు ఉపఖండం తరహా పిచ్‌లపై బాగుంటుందని స్వింగ్‌, పేస్‌, బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌లకు అదనంగా మరో పేసర్‌ సేవలు అవసరమని కొందరు అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని