
తాజా వార్తలు
బెన్‌స్టోక్స్‌ను ఇచ్చే ప్రసక్తే లేదు: రాజస్థాన్
ఇంటర్నెట్‌డెస్క్: వచ్చే నెలలో నిర్వహించే ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను ట్రేడింగ్ చేసే ప్రసక్తే లేదని రాజస్థాన్ రాయల్స్ స్పష్టం చేసింది. ముంబయి ఇండియన్స్ అభిమాని ఒకరు తాజాగా రాజస్థాన్ జట్టును తమ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను ముంబయి జట్టుకు ట్రేడింగ్ చేయాలని కోరాడు. ఆ ట్వీట్‌కు స్పందించిన ఆ ఫ్రాంచైజీ అలా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కాగా, రాబోయే సీజన్ కోసం రాజస్థాన్ ఇంతకుముందు కెప్టెన్‌గా ఉన్న స్టీవ్‌స్మిత్‌ను పూర్తిగా వదిలేసుకుంది. ఇప్పుడు స్టోక్స్‌ను కూడా వదిలేస్తే ఆ జట్టుకు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది.
మరోవైపు ముంబయి ఇండియన్స్‌కు ముగ్గురు పటిష్ఠమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. పొలార్డ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య రూపంలో బలమైన మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అలాంటప్పుడు ఆ జట్టు బెన్‌స్టోక్స్‌ను కొనుగోలు చేసే అవసరం లేదు. ఇక ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో స్టోక్స్ అన్ని మ్యాచ్‌లూ ఆడలేకపోయాడు. టోర్నీకి కాస్త ఆలస్యంగా రావడంతో 8 మ్యాచ్‌లే ఆడాడు. అందులో మొత్తం 285 పరుగులు చేశాడు. ఇక ముంబయితో తలపడిన ఓ మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ సేన 196 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా రాజస్థాన్ 18.2 ఓవర్లలో ఛేదించింది. సంజూ శాంసన్(54*; 31 బంతుల్లో 4x4, 3x6)తో కలిసి స్టోక్స్(107*; 60 బంతుల్లో 14x4, 3x6) ఆ జట్టును గెలిపించాడు.
2021 సీజన్ కోసం వదిలేసిన ఆటగాళ్లు..
ముంబయి ఇండియన్స్: కౌల్టర్‌నైల్, మెక్లెనగన్, రూథర్డ్‌ఫోర్డ్, ప్యాటిన్సన్, దిగ్విజయ్, ప్రిన్స్ బల్వంత్, మలింగ (రిటైర్డ్)
రాజస్థాన్ రాయల్స్: స్టీవెన్ స్మిత్, అంకిత్ రాజ్పుట్, ఒషేన్ థామస్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్, అనిరుద్ధ జోషి, ఆకాశ్ సింగ్, శశాంక్ సింగ్.
ఇవీ చదవండి..
వేలం ముంగిట కుర్రాళ్లకు పరీక్ష
బ్యాటర్లు మ్యాచులు.. బౌలర్లు టోర్నీలు గెలిపిస్తున్నారు