అదరగొట్టిన అంబటి రాయుడు

తాజా వార్తలు

Updated : 01/05/2021 22:03 IST

అదరగొట్టిన అంబటి రాయుడు

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  చెన్నై సూపర్‌ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీ సేన..నిర్ణీత ఓవర్లలో 218  పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్(4)ని తొలి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్‌ వెనక్కి పంపాడు. మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ (50; 28 బంతుల్లో 2×4, 4×6), మొయిన్‌ అలీ (58; 36 బంతుల్లో  5×4, 5×6) రాణించారు. ధాటిగా ఆడుతున్న అలీ బుమ్రా బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత ఓవర్లోనే డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా(2)లను పొలార్డ్‌ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (72; 27 బంతుల్లో 4×4; 7×6) సిక్సర్లతో విరుచుపడ్డాడు. జడేజా 22 పరుగులు చేశాడు. దీంతో చెన్నై భారీ స్కోరును సాధించింది. పొలార్డ్‌ 2, బౌల్ట్‌, బుమ్రా చెరో వికెట్ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని