టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి

తాజా వార్తలు

Updated : 29/04/2021 15:21 IST

టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి

దిల్లీ: అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ముంబయి..తొలుత ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచులాడిన రోహిత్‌ సేన..కేవలం రెండు విజయాలను మాత్రమే దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్‌ కూడా ఐదు మ్యాచులు ఆడి రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ఇరుజట్లు యోచిస్తున్నాయి. చూడాలి మరి ఏ జట్టును విజయం వరిస్తుందో..

ముంబయి ఇండియన్స్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, కౌల్టర్‌ నైల్‌,  జయంత్‌ యాదవ్‌, రాహుల్‌ చాహర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌.

రాజస్థాన్‌ రాయల్స్‌: సంజు శాంసన్‌ (కెప్టెన్‌),  జోస్‌ బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌, శివమ్‌ దూబె, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రియాన్‌ పరాగ్‌, క్రిస్‌ మోరిస్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని