టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి 

తాజా వార్తలు

Updated : 01/05/2021 23:45 IST

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి 

దిల్లీ: ఐపీఎల్‌లో మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దిల్లీ వేదికగా ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచి ముంబయి ఇండియన్స్‌ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన ధోనీ సేన.. ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక..ముంబయి ఇండియన్స్‌ విషయానికొస్తే.. ఆరు మ్యాచులాడిన రోహిత్‌ సేన.. 3 మ్యాచుల్లో గెలవగా..మరో మూడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. 

ముంబయి ఇండియన్స్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌పాండ్య, కృనాల్‌ పాండ్య, జిమ్మీ నీషమ్‌, రాహుల్‌ చాహర్‌, ధవళ్‌ కుల్‌కర్ణి, జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌.

చెన్నై సూపర్‌కింగ్స్‌: ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్,  మొయిన్ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, సామ్ కరన్, శార్దూల్‌ ఠాకూర్‌, ఎంగిడి, దీపక్‌ చాహర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని