T20 World Cup 2021: నమీబియా ముందు స్వల్ప లక్ష్యం..

తాజా వార్తలు

Published : 27/10/2021 21:10 IST

T20 World Cup 2021: నమీబియా ముందు స్వల్ప లక్ష్యం..

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచులో.. స్కాట్లాండ్‌ ఆరంభంలో తడబడినా.. తర్వాత నిలబడింది. నమీబియా బౌలర్లు విజృంభించడంతో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ తర్వాత కోలుకుని మోస్తరు పరుగులు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. నమీబియా ముందు 110 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో మైఖేల్ లియాస్క్‌ (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నమీబియా బౌలర్లలో ట్రంపుల్మన్‌ మూడు, జాన్‌ ఫ్రైలింక్ రెండు‌, డేవిడ్ వైస్‌, స్మిత్ తలో వికెట్ తీశారు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన స్కాట్లాండ్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. నమీబియా బౌలర్‌ ట్రంపుల్మన్‌ విజృంభించడంతో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జార్జ్‌ మున్సీ (0).. ట్రంపుల్మన్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతికే బౌల్డయ్యాడు. మూడో బంతికి కలమ్‌ మెక్‌లాయిడ్‌ (0) కీపర్‌కి చిక్కాడు. ఆ తర్వాతి బంతికే రిచీ బెర్రింగ్టన్ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రెయిగ్‌ వాల్లేస్‌ (4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. డేవిడ్ వైస్‌ వేసిన ఆరో ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి స్కాట్లాండ్‌ 22/4 స్కోరుతో నిలిచింది. మాథ్యూ క్రాస్ (19), మైఖేల్ లియాస్క్‌ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జాన్‌ ఫ్రైలింక్‌ వేసిన 12వ ఓవర్లో క్రాస్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ గ్రీవ్స్‌ (25)తో కలిసి లియాస్క్‌ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. స్మిత్ వేసిన 17 ఓవర్లో లియాస్క్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవి (5) పరుగులు చేశాడు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని