Modi: కన్నీరెందుకు..? మీ బాధ నాకు వినిపిస్తోంది..!

తాజా వార్తలు

Published : 07/08/2021 01:37 IST

Modi: కన్నీరెందుకు..? మీ బాధ నాకు వినిపిస్తోంది..!

మహిళల హాకీ జట్టుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని

దిల్లీ: చివరి వరకూ పోరాడి, తృటిలో పతకాన్ని చేజార్చుకున్న మహిళల హాకీ జట్టును ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి సముదాయించారు. ‘మీ మనసులో నిండిన బాధ నాకు వినిపిస్తోంది.. మీరు ఏ మాత్రం నిరుత్సాహపడొద్దు’ అంటూ వారికి ఓదార్పు మాటలు చెప్పారు. 

‘ఆట కోసం మీరు చిందించిన స్వేదం.. దేశంలో ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. కోచ్‌, క్రీడాకారుణులకు నా అభినందనలు’ అంటూ మోదీ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆ సమయంలో ఫోన్ చుట్టూ ఉన్న వారి ముఖాలు గంభీరంగా మారిపోయాయి. వారిలో కొందరు కన్నీరును ఆపుకోలేకపోయారు. ఇదే విషయం ప్రధానికి అర్థమైంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆయనే కలుగజేసుకొని..‘మీరు ఏడ్వద్దు.. మీ మనసులో నిండుకున్న బాధ నాకు వినిపిస్తోంది. ఈ దేశం మీ పట్ల చాలా గర్వంగా ఉంది. నిరుత్సాహానికి తావివ్వకండి. భారతదేశ గుర్తింపు అయిన హాకీకి మీ కృషి వల్ల మళ్లీ ప్రాముఖ్యత వస్తోంది’ అంటూ వాస్తవాన్ని కళ్లకు కట్టారు. 

ఈ జట్టును ప్రోత్సహిస్తూ.. మీకు సాధ్యమైనంత ప్రయత్నించారని కోచ్‌ను ప్రధాని అభినందించారు. ‘మీ ప్రదర్శనతో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపాలని, అది చాలా అవసరమని నేను వాళ్లకు చెప్పాను. థ్యాంక్యూ సర్, నమస్తే’ అంటూ కోచ్ బదులిచ్చారు. 

అలాగే బాగా ఆడిన వందనా కటారియా, సలీమా టెటెను ప్రత్యేకంగా మెచ్చుకోవడంతోపాటు..గాయపడిన నవనీత్ కౌర్ గురించి మోదీ ఆరా తీశారు. ఆమెకు కంటిదగ్గర నాలుగు కుట్లు కూడా పడ్డాయి. 

మరోపక్క ఇప్పటికే పలువురు ప్రముఖులు ట్విటర్ వేదిక వారికి ఇదే విషయం చెప్పారు. మీ ఓటమి బాధాకరమే అయినా.. మీ ప్రదర్శన విజయం కంటే తక్కువేమీ కాదని కొనియాడారు. ఈ రోజు ఉదయం జరిగిన కాంస్య పతక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ బ్రిటన్ చేతిలో 4-3 తేడాతో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని