టీమ్‌ ఇండియాను ఆయనే బలంగా తయారుచేశాడు..
close

తాజా వార్తలు

Published : 26/01/2021 15:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ ఇండియాను ఆయనే బలంగా తయారుచేశాడు..

లండన్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుని ఓడించిన టీమ్‌ఇండియాను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీయే బలమైన జట్టుగా తీర్చిదిద్దాడని ఇంగ్లాండ్‌ మాజీ సారథి నాసర్‌ హుసేన్‌ ప్రశంసించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడే కసిని ప్రస్తుత జట్టులో అతడే రగిలించాడన్నాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 నుంచి టీమ్‌ఇండియాతో తలపడే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు గట్టిపోటీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. 

‘ఏ జట్టు అయినా ఆస్ట్రేలియాకు వెళ్లి 36 పరుగులకే ఆలౌటైతే 1-0 తేడాతో సిరీస్‌లో వెనుకపడుతుంది. కెప్టెన్‌ కోహ్లీ, ప్రధాన పేసర్లు లేకున్నా సిరీస్‌ గెలవడం, అది కూడా మైదానం బయట కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కొన్నాక జరగడం చూస్తే భారత ఆటగాళ్లు భయపడనట్లు ఉన్నారు. ఇప్పుడు టీమ్‌ఇండియా బలమైన జట్టుగా మారింది. కోహ్లీయే అలా తీర్చిదిద్దాడని నేను అనుకుంటున్నా. స్వదేశంలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో ఏ తప్పూ చేయకపోతే అది అత్యంత బలమైన జట్టుగా ఉంటుంది. కాబట్టి భారత్‌తో తలపడే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగాలి’ అని హుసేన్‌ పేర్కొన్నాడు. 

కాగా, టీమ్‌ఇండియా ఇటీవల బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌లో 2-1తేడాతో విజయం సాధించగా, ఇంగ్లాండ్‌ సైతం శ్రీలంకను దాని సొంతగడ్డ మీదే 2-0తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ బలంగానే ఉన్నాయి. అయితే, ఈ సిరీస్‌ స్వదేశంలో జరుగుతున్నందున భారత్‌ గెలవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇవీ చదవండి..
ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం.. 
మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది‌: పంత్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని