టెస్టుల్లోకి నట్టూ.. వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌

తాజా వార్తలు

Published : 01/01/2021 16:23 IST

టెస్టుల్లోకి నట్టూ.. వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌

నెట్‌ బౌలర్‌గా వచ్చి మూడు ఫార్మాట్లకు ఎంపికైన యువ పేసర్‌

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా యువ పేసర్‌ టి.నటరాజన్‌ మరోసారి జాక్‌పాట్‌ కొట్టేశాడు. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. గాయపడటంతో స్వదేశానికి వెనుదిరిగిన ఉమేశ్‌యాదవ్‌ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. బుధవారమే జట్టులో చేరిన రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. చెతేశ్వర్‌ పుజారా నుంచి బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం టీమ్‌ఇండియాను గాయాల బెడద వేధిస్తోంది. ముఖ్యంగా పేసర్లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాడు. ఆసీస్‌ సిరీసుకు ముందే భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ గాయపడ్డారు. ఇక ఆసీస్‌తో మ్యాచులు ఆడుతున్నప్పుడు మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌ గాయపడ్డారు. వారిని పరిశీలించిన వైద్యబృందం విశ్రాంతి అవసరమని సూచించింది. దాంతో మహ్మద్‌ షమి స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ బదులు నటరాజన్‌ జట్టులోకి వచ్చారు. 

‘మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు మూడోరోజు ఉమేశ్‌ యాదవ్‌ ఎడమకాలి పిక్క కండరాలకు గాయమైంది. మిగతా రెండు టెస్టుల్లోపు అతడు కోలుకొనే అవకాశాల్లేవు. దాంతో మిగిలిన టెస్టు సిరీసుకు దూరం అవుతున్నాడు. అతడి స్థానంలో టి.నటరాజన్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. బాక్సింగ్‌ డే టెస్టుకు ముందే షమి బదులు శార్దూల్‌ ఠాకూర్‌ జట్టులో చేరాడు’ అని బీసీసీఐ కార్యదర్శి జే షా మీడియాకు తెలిపారు.

నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాకు చేరుకున్న తంగరసు నటరాజన్‌ నెల రోజుల వ్యవధిలోనే జట్టులో కీలకమైపోయాడు. తొలుత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. వన్డే సిరీసులో జట్టు ఇబ్బందులు ఎదుర్కోవడంతో 50 ఓవర్ల ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. తర్వాత టీ20 సిరీసులోనూ అదరగొట్టాడు. ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. అత్యంత నిలకడ, కచ్చితత్వంతో యార్కర్లు సంధించగలగడం నట్టూ ప్రత్యేకత. ఇక క్వారంటైన్‌ ముగించుకొని జట్టులో చేరిన రోహిత్‌ శర్మకు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

ఇవీ చదవండి
కోహ్లీసేన.. 2021లో మారాలిక!
మానసిక ఇబ్బందుల్లో స్మిత్‌..!

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని