
తాజా వార్తలు
టీమ్ఇండియాలో మరో ఆటగాడికి గాయం
గబ్బా: టీమ్ఇండియాకు గాయాలబెడద కొనసాగుతూనే ఉంది. తాజాగా నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా పేసర్ నవ్‌దీప్ సైని గాయపడి మైదానం వీడాడు. అతడు 36వ ఓవర్ బౌలింగ్ చేస్తుండగా ఇబ్బంది పడడంతో ఫిజియో వచ్చి పరీక్షించాడు. దీంతో సైని మైదానం వీడాడు. అయితే ఈ గాయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా 47 ఓవర్లకు 121/3తో నిలిచింది. లబుషేన్(51*), వేడ్(16*) నిలకడగా ఆడుతున్నారు.
ఇవీ చదవండి..
2001.. ఓడామంటే భజ్జీ వల్లే: స్టీవ్‌వా
‘అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’
Tags :