close

తాజా వార్తలు

Updated : 09/04/2021 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒలింపిక్స్‌కు ఎంపికై నేత్రా సరికొత్త రికార్డు

దిల్లీ: చెన్నైకి చెందిన 23 ఏళ్ల మహిళా సెయిలర్‌ నేత్ర కుమనన్‌ టోక్యో ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది రికార్డు సృష్టించింది. ఒమన్‌లో జరిగిన ముస్సానా ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌లో లేసర్‌ రేడియల్‌ రేసులో మొదటి స్థానంలో నిలిచి ఈ ఘనత సాధించింది. ఇది ఆసియా, ఆఫ్రికన్‌ క్వాలిఫైయింగ్‌ ఈవెంట్‌  ఈ రేసులో నేత్ర కుమనన్‌ 18 పాయింట్లతో ముందంజలో నిలవగా, రమ్య శరవణన్ అనే మరో మహిళా నావికురాలు 39 పాయింట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. కుమనన్‌ తన ప్రత్యర్థితో పోటీ పడి 21 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. సెయిలింగ్‌లో తక్కువ పాయింట్లు ఉన్న అథ్లెట్లు పోటీలో గెలిచినట్లు లెక్కిస్తారు.

ఇప్పటి వరకూ మన దేశం నుంచి ఒలింపిక్స్‌కు 10 సెయిలర్స్‌ ఎంపికవగా, అందులో 9 మంది పురుషులు. సోలి కాంట్రాక్టర్‌, ఎ.ఎ.బసిత్‌ (1972), ధ్రువ్‌ భండారి (1984), ఎఫ్‌ తారాపూర్‌, సైరస్‌ కామా, కెల్లీ రావు (1988), ష్రాఫ్‌, సునీత్‌ పటేల్‌ (2004), నచతార్‌ సింగ్‌ జోహల్‌ (2008) ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. భారత్‌ నుంచి ఒలింపిక్స్‌ అర్హత సాధించిన మొట్టమొదటి మహిళా సెయిలర్‌ నేత్రా కుమారి అని ఆసియా సెయిలింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మాలావ్‌ ష్రాఫ్‌ తెలిపారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని