భారత్‌పై న్యూజిలాండ్‌ స్వల్ప ఆధిక్యం..
close

తాజా వార్తలు

Published : 22/06/2021 21:04 IST

భారత్‌పై న్యూజిలాండ్‌ స్వల్ప ఆధిక్యం..

కివీస్‌ను కట్టడి చేసిన షమి, ఇషాంత్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఐదోరోజు రెండో సెషన్‌లో న్యూజిలాండ్‌ 249 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్లు మహ్మద్‌ షమి 4/76, ఇషాంత్‌ శర్మ 3/48 మెరుగైన ప్రదర్శన చేశారు. కాగా, తొలి సెషన్‌లో మూడు వికెట్లు తీసిన టీమ్‌ఇండియా రెండో సెషన్‌లో మిగిలిన అన్ని వికెట్లు తీసింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(49; 177 బంతుల్లో 6x4) పట్టుదలగా బ్యాటింగ్‌ చేశాడు. మరోవైపు టెయిలెండర్లు కైల్‌ జేమీసన్‌(21; 16 బంతుల్లో 1x6), టిమ్‌సౌథీ(30; 46 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడి భారత్‌పై 32 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిపెట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని