కేంద్ర బడ్జెట్‌లో టీమ్‌ఇండియా ముచ్చట

తాజా వార్తలు

Updated : 01/02/2021 15:00 IST

కేంద్ర బడ్జెట్‌లో టీమ్‌ఇండియా ముచ్చట

ఇంటర్నెట్‌డెస్క్‌: లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2021 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ టీమ్‌ఇండియా క్రికెట్‌ జట్టును కొనియాడారు. ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్‌ సాధించిన అద్భుత విజయాన్ని ఆమె ప్రస్తావించారు. ‘క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే దేశంగా ఉన్న భారత్‌.. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించాక మనం పొందిన అనుభూతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. ఆ విజయం ప్రజలకే కాకుండా ముఖ్యంగా యువతలోనూ స్ఫూర్తి నింపింది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎలా ముందుకు సాగాలనే విషయాన్ని స్పష్టం చేసింది. ఓటముల తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేసి గెలవాలన్న దాహార్తిని, కసిని రగిలించింది’ అని సీతారామన్‌ పేర్కొన్నారు.

కాగా, అడిలైడ్‌లో జరిగిన డే/నైట్‌ టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో నిలిచినా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. 36 పరుగులకే ఆలౌటై ఘోర అవమానాన్ని మూట గట్టుకుంది. దీంతో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గైర్హాజరి, పలువురు కీలక ఆటగాళ్ల గాయాలు టీమ్‌ఇండియాను మరింత భయపెట్టాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టు పగ్గాలు అందుకున్న రహానె యువ ఆటగాళ్లతో మెల్‌బోర్న్‌, గబ్బా టెస్టులు గెలిచి ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు. దాంతో టీమ్‌ఇండియా.. 2-1 తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఘోర పరాజయం పాలైనా బలంగా పుంజుకుందని భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా జరిగిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలోనూ ప్రధాని నరేంద్రమోదీ భారత జట్టును కొనియాడిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..
మరింత పెరగనున్న చమురు ధరలు
బడ్జెట్‌ బూస్ట్‌.. మార్కెట్లు జూమ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని