Rohit sharma: 5 శతకాల రికార్డుకు 2 ఏళ్లు పూర్తి

తాజా వార్తలు

Updated : 06/07/2021 12:21 IST

Rohit sharma: 5 శతకాల రికార్డుకు 2 ఏళ్లు పూర్తి

ప్రపంచ క్రికెట్లో ఇలాంటి రికార్డు రోహిత్‌కే  సొంతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. మంచినీళ్ల ప్రాయంగా డబుల్‌ సెంచరీలు చేసే హిట్‌మ్యాన్‌ ఒక వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలు చేసిన తొలి క్రికెటర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. 2019లో ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన మెగా టోర్నీలో అతడు శతకాల మోత మోగించాడు. హిట్‌మ్యాన్‌ ఈ ఘనత సాధించి నేటికి(జులై 6) రెండేళ్లు.

గతంలో ఒక ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు సాధించిన రికార్డు శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర పేరుతో ఉండేది. అతడు 2015 ప్రపంచకప్‌లో 4 శతకాలు బాదేశాడు. దానిని రోహిత్‌ 2019 ప్రపంచకప్‌లో బద్దలు కొట్టాడు. సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికాపై 122*, మాంచెస్టర్‌లో పాక్‌పై 140, బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌పై 102, బర్మింగ్‌హామ్‌లో బంగ్లాదేశ్‌పై 104, లీడ్స్‌లో శ్రీలంకపై 103 పరుగులు బాదేశాడు.

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్‌ మరో ఘనత అందుకున్నాడు. సచిన్‌ తెందూల్కర్‌ (673) తర్వాత మెగా టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన రెండో భారతీయుడిగా అవతరించాడు. 2003 ప్రపంచకప్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ ఏకంగా 673 పరుగులు సాధించాడు. 2019లో హిట్‌మ్యాన్‌ 648 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ జాబితాలో మాథ్యూ హెడేన్‌ (2007 ప్రపంచకప్‌లో 659) రెండో స్థానంలో నిలిచాడు. ఇన్ని సెంచరీలు చేసిన రోహిత్‌ శర్మ కీలకమైన సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 1 పరుగే చేయడంతో అభిమానుల గుండె పగిలింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని