ఇన్‌స్టాలో విరాట్‌ రికార్డు
close

తాజా వార్తలు

Updated : 02/03/2021 14:57 IST

ఇన్‌స్టాలో విరాట్‌ రికార్డు

ధోనీ కన్నా మూడింతలు ఎక్కువ..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు. ఇది క్రికెట్‌లో కాకుండా వ్యక్తిగతంగా రికార్డు కావడం విశేషం. కోహ్లీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పది కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలవడమే కాకుండా ఆసియాలోనే తొలి సెలబ్రిటిగా అవతరించాడు. ఈ నేపథ్యంలోనే ఫుట్‌బాల్‌ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీల తర్వాత అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఆటగాడిగా టీమ్‌ఇండియా సారథి నిలిచాడు. ప్రస్తుతం క్రిస్టియానో రొనాల్డో అత్యధికంగా 26.6 కోట్ల మందితో కొనసాగుతుండగా, మెస్సీ 18.7 కోట్ల మందితో ఉన్నాడు. మరోవైపు బీసీసీఐ, ఐసీసీ, రియల్‌ మ్యాడ్రిడ్‌, ఎఫ్‌సీ బార్సిలోనా లాంటి ప్రముఖ క్రీడా సంబంధిత సంస్థలను అనుసరించే వారి సంఖ్య కన్నా కోహ్లీని ఫాలో అయ్యేవారి సంఖ్యే అధికంగా ఉంది.

అలాగే భారత్‌లో విశేషమైన అభిమాన గణం ఉన్న టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని ప్రస్తుతం 3.4 కోట్ల మంది అనుసరిస్తున్నారు. దీంతో మాజీ సారథి కన్నా కోహ్లీని అనుసరిస్తున్న వారి సంఖ్య మూడింతలు ఎక్కువగా ఉంది. విరాట్‌ తర్వాత భారత్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నది బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా. శ్రద్ధా కపూర్‌. ప్రియాంకను 6 కోట్ల మందికిపైగా అనుసరిస్తుండగా, శ్రద్ధాను 5 కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. కాగా, కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో రెండు అర్ధశతకాలు సాధించిన అతడి నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. ఎందుకంటే కోహ్లీ శతకం సాధించి 16 నెలలు దాటిపోయింది. చివరిసారి 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై 70వ అంతర్జాతీయ శతకం బాదాడు. దీంతో నాలుగో టెస్టులోనైనా విరాట్‌ మూడంకెల స్కోర్‌ సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని