మా విషయాల్లో మీ జోక్యం అనవసరం: ఓజా
close

తాజా వార్తలు

Updated : 04/02/2021 05:07 IST

మా విషయాల్లో మీ జోక్యం అనవసరం: ఓజా

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం వ్యక్తం చేస్తూ పాప్‌సింగర్ రిహానె చేసిన ట్వీట్‌పై మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా మండిపడ్డాడు. మా అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. రైతుల ఉద్యమంపై సీఎన్‌ఎన్‌ ప్రచురించిన కథనాన్ని జోడించి.. ‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’ అంటూ రిహానె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌ మంగళవారం ట్విటర్‌లో ట్రెండింగ్‌గా నిలచింది.

అయితే రిహానె ట్వీట్‌పై ఓజా తీవ్రంగా స్పందించాడు. ‘‘రైతుల పట్ల మా దేశం గర్వంగా ఉంది. వాళ్లు దేశానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. త్వరలో దీన్ని పరిష్కరిస్తారని నేను విశ్వసిస్తున్నా. అయితే, మా అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’’ అని రిహానె ట్వీట్‌కు ఓజా బదులిచ్చాడు. రిహానా ట్వీట్‌పై ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాగా, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి

చెపాక్‌ గడ్డ.. త్రిశతకాల అడ్డా!

భారత్ ఆత్మీయ దేశం: పీటర్సన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని