
తాజా వార్తలు
గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా అద్వితీయ ప్రదర్శనకు ఆస్ట్రేలియా బిత్తరపోతోంది. ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా భారత జట్టులో అదే పట్టుదల, అదే కసి! గబ్బా వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఆతిథ్య జట్టుకు టీమిండియా దీటుగా సమాధానమిస్తోంది. 188/6తో కష్టాల్లో పడిన జట్టును కుర్రాళ్లు శార్దూల్ ఠాకూర్ (67), వాషింగ్టన్ సుందర్ (62) అర్ధశతకాలతో ఆదుకున్నారు. అద్భుత ప్రదర్శనతో ఆసీస్‌పై ఆధిపత్యం చెలాయించారు. ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 33 పరుగులకే పరిమితం చేశారు. అయితే సుందర్‌కు ఇది తొలి టెస్టు కాగా, శార్దూల్‌కు రెండో మ్యాచ్. ఈ నేపథ్యంలో శార్దూల్, సుందర్ అసాధారణ పోరాటంపై మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
‘‘వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అసలైన టెస్టు క్రికెట్ అంటే ఇదే. అరంగేట్రంలోనే వాషింగ్టన్ టాప్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక శార్దూల్ ప్రదర్శకు హ్యాట్సాఫ్’’ - విరాట్ కోహ్లీ
‘‘గబ్బా.. వారిద్దరికి దాబా! సుందర్, ఠాకూర్ గొప్ప ప్రదర్శన చేశారు. భారత జట్టు ప్రదర్శనను ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘దబాంగ్’. ధైర్యంగా ఆడారు’’ - వీరేంద్ర సెహ్వాగ్
‘‘కఠిన సవాళ్ల మధ్య టీమిండియా అద్భుత పోరాటం చేసింది. శార్దూల్, సుందర్ గొప్ప భాగస్వామ్యం నెలకొల్పారు’’ - సచిన్ తెందుల్కర్
‘‘టీమిండియాకే మొత్తం క్రెడిట్. ఈ పర్యటనలో వారి ప్రదర్శన అసాధారణం. ఎన్నో గాయాలతో వాళ్లకు ప్రతికూలత పరిస్థితులు ఎదురయ్యాయి. జట్టుతో పాటు రిజర్వ్ బెంచ్ కూడా ఎంతో బలంగా ఉన్న జట్టు ఏదంటే అది భారత్. గొప్ప ఆటగాళ్లు వాళ్ల సొంతం’’ - మైకేల్ వాన్
‘‘నెట్ బౌలర్‌గా వచ్చిన శార్దూల్, సుందర్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్లగా నిలిచారు. వాళ్ల పోరాటాన్ని అభినందించాల్సిందే’ - దినేశ్ కార్తీక్
‘‘సుందర్-శార్దూల్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో భారత్ పోరాటానికి వాళ్లు ప్రతీకగా నిలిచారు. తమ సామర్థ్యం కంటే గొప్ప ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది ఎంతో సంతృప్తినిస్తుంది’’ - హర్షా భోగ్లే
ఇదీ చదవండి
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 336 ఆలౌట్
శార్దూల్, సుందర్ రికార్డు భాగస్వామ్యం