Virat Kohli: కోహ్లీకి పాక్‌ క్రికెటర్‌ మద్దతు

తాజా వార్తలు

Published : 28/06/2021 14:47 IST

Virat Kohli: కోహ్లీకి పాక్‌ క్రికెటర్‌ మద్దతు

కొత్త కెప్టెన్‌ ప్రపంచకప్‌ గెలుస్తాడనే గ్యారంటీ ఏంటన్న అక్మల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి పాక్‌ మాజీ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ కమ్రాన్‌ అక్మల్‌ అండగా నిలిచాడు. అతడి స్థానంలో కొత్త కెప్టెన్‌ను నియమిస్తే మాత్రం మ్యాచులు గెలుస్తారనేందుకు హమీ ఏముందని ప్రశ్నించాడు. ఐసీసీ టోర్నీల్లో భారత్‌ ఆఖరి మెట్టుపై ఎందుకు బోల్తా పడుతోందో విశ్లేషించుకోవాలని సూచించాడు. అంతేతప్ప, విరాట్‌ను తొలగించడం పరిష్కారం కాదని వెల్లడించాడు.

విరాట్‌ కోహ్లీ ఇప్పటి వరకు మూడు ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియాకు సారథ్యం వహించాడు. ఆ మూడింట్లో ఎందులోనూ భారత్‌ ట్రోఫీ గెలవలేదు. 2017 ఐసీసీ ట్రోఫీలో పాక్‌ చేతిలో ఫైనల్‌లో ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో కివీస్‌ చేతిలో ఓటమి చవిచూసింది. ఇక ఈ మధ్యే జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అదే కివీస్‌తో మరోసారి ఓడింది. దాంతో నెటిజన్లు మీమ్స్‌తో కోహ్లీని ఎగతాళి చేస్తున్నారు. మరికొందరు అతడి నుంచి నాయకత్వ బాధ్యతలు మరొకరికి అప్పజెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

‘విరాట్‌ కోహ్లీ గొప్ప క్రికెటర్‌. అద్భుతమైన కెప్టెన్‌. అతడు దూకుడుగా కనిపిస్తాడు. భావోద్వేగంతో ఉంటాడు. టీమ్‌ ఇండియాకు వచ్చిన ఏ నాయకుడైనా భారత క్రికెట్‌ను ముందుకే తీసుకెళ్తున్నాడు. సౌరవ్‌ గంగూలీతో ఇది మొదలైంది. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌, ఎంఎస్‌ ధోనీ బాధ్యతలు స్వీకరించారు. అవును, విరాట్‌ కోహ్లీ ఐసీసీ ట్రోఫీలు గెలవలేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ అవి తప్ప మిగతావన్నీ అతడు సాధించాడు. టీమ్‌ఇండియా ఎన్నో సిరీసులు గెలిచింది’ అని కమ్రాన్‌ అన్నాడు.

‘టీమ్‌ఇండియా ఐసీసీ టోర్నీలు గెలవకపోవడం పూర్తిగా విరాట్‌ ఒకడి తప్పు కాదు. అతడి స్థానంలో మరొకరు వచ్చి ఐసీసీ టోర్నీ గెలుస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? కీలక టోర్నీల్లో ఎందుకు విఫలమవుతున్నారో జట్టుగా విశ్లేషించుకోవాలి. వారు తుది దశకు చేరుకొని ఆఖరి అడ్డంకి దాటలేక పోతున్నారు. కేవలం విరాట్‌నే నిందించడం న్యాయం కాదు. నా వరకైతే అతడెన్ని రోజులు నాయకత్వం వహించగలడని అనుకుంటే అన్ని రోజులు కెప్టెన్‌గా కొనసాగాలి’ అని కమ్రాన్‌ అక్మల్‌ పేర్కొన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని