పాక్‌ క్రికెట్‌లో అక్రమాలు!

తాజా వార్తలు

Published : 03/01/2021 01:53 IST

పాక్‌ క్రికెట్‌లో అక్రమాలు!

ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత పాకిస్థాన్‌ జట్టులో ఉన్న పేసర్లు వయసు తప్పుగా నమోదు చేసి అవకాశాలు సాధిస్తున్నారని ఆ దేశ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ ఆరోపించాడు. 27-28 ఏళ్ల వయసు ఉన్న పేసర్లు 17-18 ఏళ్లుగా నమ్మించి ఆడుతున్నారని, వాళ్లకి కనీసం ఫిట్‌నెస్‌ కూడా లేదని విమర్శించాడు. ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి అలసిపోయి ఫీల్డింగ్ చేయలేకపోతున్నారని అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో పాకిస్థాన్‌ ఓటమిపాలైన నేపథ్యంలో ఆసిఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘17-18 ఏళ్ల వయసు అని నమోదు చేశారు. కానీ వాళ్లకి 27-28 ఏళ్లు ఉంటాయి. కనీసం 20 నుంచి 25 ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేకపోతున్నారు. అంతేకాకుండా ఫిట్‌నెస్‌తో కూడా లేరు. 5-6 ఓవర్ల స్పెల్‌ను వేసిన తర్వాత ఫీల్డింగ్‌ కూడా చేయలేకపోతున్నారు. ఫాస్ట్ బౌలర్‌ పది వికెట్లు పడగొట్టి దాదాపు ఐదారేళ్లు అవుతుంది. న్యూజిలాండ్ పిచ్‌లు చూస్తే అప్పట్లో మాకు నోరూరేది. కనీసం అయిదు వికెట్లు తీయకుండా బంతిని విడిచి పెట్టేవాళ్లం కాదు. కానీ ప్రస్తుత బౌలర్లకు బ్యాట్స్‌మెన్‌తో ఎలా తప్పులు చేయించాలో తెలియట్లేదు’’ అని అసిఫ్ అన్నాడు.

అయితే వయసు తప్పుగా చూపిస్తూ కొందరు ఆటగాళ్లు అవకాశాలు సాధిస్తున్నారని ఆరోపణలు రావడం పాక్‌ క్రికెట్‌లో కొత్తేమి కాదు. గత కొన్నేళ్లుగా ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కాగా, మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో కెరీర్‌ను కోల్పోయిన ఆసిఫ్‌.. అవినీతిపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2010లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేశాడని అతడిపై ఐసీసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

దాదాకు అస్వస్థత

అభిమాని సర్‌ప్రైజ్‌: బాగోదన్న రోహిత్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని