మైదానంలో కృనాల్‌ కన్నీరు..!

తాజా వార్తలు

Updated : 24/03/2021 10:09 IST

మైదానంలో కృనాల్‌ కన్నీరు..!

అర్ధశతకం తండ్రికి అంకితం

పాండ్య సోదరుల ప్రేమ

(Images: Twitter)

పుణె: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టాస్‌కు ముందు మైదానంలో భారత జట్టు శిబిరంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్‌ పాండ్యకు.. అతని సొంత తమ్ముడైన హార్దిక్‌ పాండ్య జట్టు టోపీ అందించాడు. దాన్ని అందుకున్న తర్వాత ఆకాశం వైపు చూపించిన కృనాల్‌..  ఇటీవల కన్నుమూసిన తన తండ్రిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు.  మ్యాచ్‌లో అజేయ అర్ధశతకంతో చెలరేగిన కృనాల్‌.. 50 పరుగులకు చేరుకున్నపుడు పెవిలియన్‌లో ఉన్న హార్దిక్‌ కళ్లు చెమర్చాయి. ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత అన్నను హార్దిక్‌ గట్టిగా కౌగిలించుకోవడం విశేషం. ఇప్పటివరకూ టీమ్‌ఇండియా తరపున 18 టీ20లు ఆడిన కృనాల్‌.. ఇప్పుడు తొలి వన్డేలో అర్ధశతకం చేసిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ తన తండ్రికి ఈ ఇన్నింగ్స్‌ను అంకితమిచ్చాడు. ఇన్నింగ్స్‌ విరామంలో అతణ్ని మాట్లాడించేందుకు ప్రయత్నించగా.. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయిన అతను ఈ అర్ధశతకాన్ని తండ్రికి అంకితమిస్తున్నట్లు గద్గద స్వరంతో పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌ జట్టులోనూ సోదరులైన టామ్‌ కరన్, సామ్‌ కరన్‌ ఈ మ్యాచ్‌లో ఆడడం విశేషం. పాండ్య సోదరుల్లాగే వీళ్లిద్దరూ కూడా ఆల్‌రౌండర్లే. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని