జులై 13న ‘ఒలింపిక్స్‌’ క్రీడాకారులతో మోదీ సమావేశం

తాజా వార్తలు

Published : 12/07/2021 01:11 IST

జులై 13న ‘ఒలింపిక్స్‌’ క్రీడాకారులతో మోదీ సమావేశం

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు క్రీడాకారులు సిద్ధమయ్యారు. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో వివిధ విభాగాల్లో పోటీ పడి భారత్‌కు పతకాలు సాధించిపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ క్రీడాకారులను ఉత్సాహ పర్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారితో సమావేశం కానున్నారు. జులై 13న ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమవుతారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న అథ్లెట్లలో స్ఫూర్తి నింపడం కోసం ప్రధాని వారితో మాట్లాడతారని పేర్కొంది.

భారత్‌ తరఫున 18 విభాగాల్లో పాల్గొనేందుకు మొత్తం 126 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో ఆడేందుకు వెళ్తున్నారని, అత్యధికంగా ఇంతమంది అథ్లెట్లను పంపడం ఇదే తొలిసారని పీఎంవో తెలిపింది. తొలిసారి ఫెన్సింగ్‌ విభాగంలో భారత్(భవానీ దేవి) పాల్గొనబోతుందని గుర్తు చేసింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా సెయిలర్‌గా నేత్ర కుమారన్‌ నిలిచిందని, అలాగే.. భారత్‌ తరఫున స్విమ్మింగ్‌ విభాగంలో పాల్గొనేందుకు సాజన్‌ ప్రకాశ్‌, శ్రీహరి నటరాజ్‌ తొలిసారి అర్హత సాధించారని పీఎంవో తెలిపింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని