భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టుపై మోదీ ఆసక్తి..
close

తాజా వార్తలు

Updated : 15/02/2021 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టుపై మోదీ ఆసక్తి..

చెన్నై: భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టుపై ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తి చూపిస్తున్నారు. ఆదివారం ఆయన చెన్నై పర్యటన సందర్భంగా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఏరియల్‌ వ్యూ నుంచి తీసిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోందని ట్వీట్‌ చేశారు. కాగా, రెండో టెస్టులో టీమ్‌ఇండియా మ్యాచ్‌పై పట్టు సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగా, ఇంగ్లాండ్‌ 134 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌ (5/43) విజృంభించడంతో పర్యాటక జట్టు విలవిల్లాడింది. దీంతో భారత్‌కు 195 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కోహ్లీసేన ఆదివారం ఆట నిలిచిపోయే సరికి 54/1తో నిలిచింది. 

మరోవైపు చెన్నై పర్యటనకు వెళ్లిన మోదీ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ స్టేడియానికి వెళ్లి దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్‌ ఫొటోలకు నివాళులర్పించారు. అలాగే అడయారులోని ఐఎన్‌ఎస్‌ కోస్ట్‌గార్డ్‌ ప్రాంగణానికి చేరుకుని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తమిళనాడులో రూపొందించిన ‘అర్జున్‌ యుద్ధ ట్యాంకు మార్క్‌-1ఏ’ను సైన్యానికి అప్పగించారు. దీన్ని సైన్యానికి అందజేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. భారత సైన్యాన్ని ప్రపంచంలోనే ఆధునికమైన సైనిక దళాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పని చేస్తూనే ఉంటామని చెప్పారు. మాతృభూమిని రక్షించే పూర్తి సత్తా వాటికి ఉందని తెలిపారు. మన భద్రతా దళాలను చూసి దేశం గర్విస్తోందని, యావత్‌ ప్రపంచం ఇప్పుడు భారత్‌ వైపు చూస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈ శతాబ్దం మనదేనని సగర్వంగా తెలిపారు. 

ఇవీ చదవండి..
పంత్‌ గాడిలో పడినట్టేనా..?
అశ్విన్‌ @ 200.. ఒకేఒక్కడు 
కోహ్లీ విజిలేస్తే.. చెపాక్ దద్దరిల్లే.. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని