బుమ్రా ఫాస్ట్‌ బౌలర్‌ కాదు.. లెగ్ స్పిన్నర్‌!

తాజా వార్తలు

Published : 01/02/2021 01:29 IST

బుమ్రా ఫాస్ట్‌ బౌలర్‌ కాదు.. లెగ్ స్పిన్నర్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: జస్ప్రీత్ బుమ్రా టీమిండియా పేసర్‌ కదా? లెగ్ స్పిన్నర్‌ ఏంటని అనుకుంటున్నారా? బుమ్రా ఫాస్ట్‌ బౌలరే, అయితే అతడు లెగ్‌ స్పిన్‌ను సాధన చేస్తున్నాడు. భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేలా అనుకరిస్తూ నెట్స్‌లో బంతులు విసురుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘బుమ్రా యార్కర్లు, బౌన్సర్లు మనం చూశాం. అయితే ఇప్పటివరకు ఫాస్ట్‌ బౌలర్లు ప్రదర్శించని సరికొత్త వెర్షన్‌లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. లెజెండ్‌ కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తున్నాడు’ అని బీసీసీఐ వీడియోకి వ్యాఖ్య జతచేసింది.

కాగా, ఈ పోస్ట్‌పై అనిల్ కుంబ్లే స్పందించాడు. ‘వెల్‌డన్‌ బుమ్రా. నాలానే బౌలింగ్ చేస్తున్నావు. నీ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించడానికి ప్రయత్నిస్తున్న ఎంతో మంది యువ బౌలర్లకు.. నువ్వు స్ఫూర్తి. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో రాణించాలని కోరుకుంటున్నా’ అని కుంబ్లే వీడియోకి కామెంట్ చేశాడు. విభిన్న శైలితో, కచ్చితత్వంతో బుమ్రా వేసే యార్కర్లకు బ్యాట్స్‌మెన్‌ వద్ద సమాధానం ఉండదనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బుమ్రా ఇంగ్లాండ్ సిరీస్‌ కోసం చెన్నైలో బయోబబుల్‌లో ఉంటున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా తొలి టెస్టు జరగనుంది.

ఇవీ చదవండి

అది చరిత్ర.. ఇప్పుడు నేను కెప్టెన్‌ కాదు

మోదీ ప్రశంసలు..బీసీసీఐ ధన్యవాదాలుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని