ఆరోజు గదిలోకెళ్లి ఏడ్చాను.. : పృథ్వీషా

తాజా వార్తలు

Published : 12/03/2021 15:26 IST

ఆరోజు గదిలోకెళ్లి ఏడ్చాను.. : పృథ్వీషా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఏమీ అర్థంకాని పరిస్థితికి చేరుకున్నానని టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌హజారె ట్రోఫీలో అత్యధికంగా 754 పరుగులు చేసిన అతడు తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో (0, 4) విఫలమైన పృథ్వీని టీమ్‌ఇండియా తర్వాతి టెస్టులకు దూరంపెట్టిన సంగతి తెలిసిందే. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారని ప్రశ్నించగా..

‘అప్పుడు నేను చాలా ఆందోళనకు గురయ్యా. ఏం జరుగుతోందని నన్ను నేను ప్రశ్నించుకున్నా. నా బ్యాటింగ్‌లో లోపాలుంటే.. అవేంటని ఆలోచించా. అయితే, పింక్‌బాల్‌ టెస్టులో ప్రపంచంలోనే మేటి జట్టుతో ఆడానని నాకు నేను సర్దిచెప్పుకున్నా. ఆ మ్యాచ్‌లో నేనెందుకు బౌల్డ్‌ అయ్యానని ప్రశ్నించుకున్నా. అద్దం ముందు నిల్చొని అందరూ అనుకున్నంత చెత్త ఆటగాడిని మాత్రం కాదని భావించా. ఆ సిరీస్‌లో జట్టు గెలిచినందుకు సంతోషంగా ఉన్నా నన్ను పక్కనపెట్టడంతో ఆందోళన చెందా. అదే నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. ఆరోజు గదిలోకెళ్లి ఏడ్చేశాను. ఏదో జరుగుతుందని అనిపించింది’ అని పృథ్వీ చెప్పుకొచ్చాడు.

కాగా, ఆ పర్యటన తర్వాత విజయ్‌ హజారె ట్రోఫీలో ఆడుతున్న పృథ్వీ.. ముంబయి కెప్టెన్‌గా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలోనే మూడు సెంచరీలతో పాటు ఒక ద్విశతకం సాధించి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో మూడేళ్ల క్రితం ఇదే టోర్నీలో కర్ణాటక బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ సాధించిన 723 అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇక ఈ సీజన్‌లో ముంబయి గురువారం కర్ణాటక జట్టును ఓడించడంతో ఫైనల్‌కు చేరింది. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌తో ఫైనల్లో తలపడనుంది. పృథ్వీ మరోసారి ఇక్కడ చెలరేగితే ముంబయికి కప్పు అందించడం ఖాయం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని