
తాజా వార్తలు
గబ్బా టెస్టు: పుజారా హాఫ్ సెంచరీ
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా(52*) అర్ధశతకంతో కొనసాగుతున్నాడు. రోహిత్(7) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అతడు శుభ్మన్ గిల్(91)తో కలిసి రెండో వికెట్కు 114 పరుగుల శతక భాగస్వామ్యం నిర్మించాడు. ఆపై కెప్టెన్ రహానె(24)తో కలిసి మూడో వికెట్కు 35 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే రహానె ఔటయ్యాక పంత్(31*)తో కలిసి పుజారా ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ 74 ఓవర్లకు 217/3 స్కోర్ సాధించింది. టీమ్ఇండియా విజయానికి ఇంకా 111 పరుగుల దూరంలో నిలిచింది.
ఇవీ చదవండి..
అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు..
ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
Tags :