IPL 2021:పంజాబ్‌ కింగ్స్‌ లక్ష్యం 186

తాజా వార్తలు

Updated : 21/09/2021 21:44 IST

IPL 2021:పంజాబ్‌ కింగ్స్‌ లక్ష్యం 186

ఇంటర్నెట్ డెస్క్‌: దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ సేన.. 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వీ జైస్వాల్‌ (49; 36 బంతుల్లో 6×4, 2×6), మహిపాల్‌ లోమ్రోర్‌ (43; 17 బంతుల్లో 2×4, 4×6) రాణించారు.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్ ఎవిన్‌ లూయిస్‌ (36; 21 బంతుల్లో 7×4, 1×6) దూకుడుగా ఆడాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన ఆరో ఓవర్‌లో లూయిస్.. మయాంక్‌ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (4) నిరాశపర్చగా.. లివింగ్‌ స్టోన్ (25) ఫర్వాలేదనిపించాడు. ఆదిల్‌ రషీద్‌ వేసిన ఏడో ఓవర్లో యశస్వీ ఒక ఫోర్‌, సిక్స్ బాదాడు. 14 ఓవర్ల వరకు భారీగా పరుగులు సమర్పించుకున్న పంజాబ్‌ బౌలర్లు.. చివరి ఆరు ఓవర్లలో పుంజుకున్నారు. వరుసగా వికెట్లు తీస్తూ రాజస్థాన్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. షమి మూడు వికెట్లు తీశాడు. పొరెల్‌, హర్‌ప్రీత్ బ్రర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని